నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 2 : జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని జెడ్పీ కార్యాలయంలో శుక్రవారం 2, 4, 3, 5 స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఆయా సమావేశాల్లో వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. 2, 4 స్థాయీ సంఘాల స మావేశాలకు ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. హరితహారంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యం మేరకు నాటిన మొక్కలను సంరక్షించే బా ధ్యత అందరిపై ఉందన్నారు. బృ హత్ పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఈ నెలాఖరు లోగా జిల్లా లో మిగిలిపోయిన నాలుగు వాటర్ ట్యాంకుల నిర్మాణాలను పూర్తి చే యాలన్నారు.
దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలి క వసతుల కల్పన, దవాఖానల ఆవరణలో పరిశుభ్రత ఉండేలా మెడికల్ ఆఫీసర్లను ఆదేశించాలని వైద్యాధికారిని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం కో సం ప్రభుత్వం కోట్ల వెచ్చించి నిధులను ఖర్చు చేస్తుందన్నా రు. డీఈవో సమావేశానికి హాజరు కాకపోవడంపై అసంతృ ప్తి వ్యక్తం చేశారు. మన ఊరు మన బడిలో జిల్లాలో ఎంపికైన పాఠశాలల్లో పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 3వ స్థాయీ సంఘ సమావేశానికి జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖ అధ్యక్షత వహించగా, 5వ స్థాయీ సంఘ సమావేశానికి జెడ్పీటీసీ జ్యోతి అధ్యక్షత వహించా రు. కార్యక్రమంలో జెడ్పీ ఇన్చార్జి సీఈవో జ్యోతి, జెడ్పీటీ సీ అశోక్‌కుమార్, కో ఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్, వివిధ శాఖ ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.