అయిజ, నవంబర్ 19 : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పద్నాలుగేండ్లు కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో అభివృద్ధి శరగవేగంగా జరుగుతున్నది. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయుడిను నిలబెట్టాం. కారు గుర్తుకు ఓటు వేసి విజయుడిని అధిక మెజార్టీతో గెలిపించాలి. సీఎం కేసీఆర్ పదేళ్లుగా అలంపూర్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఓటర్లు బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తే అలంపూర్ నియోజకవర్గంలోని సమస్యలు తీరుతాయి.
ఆర్డీఎస్, తుమ్మిళ్ల పెండింగ్ పనులు సీఎం కేసీఆర్ హయాంలో పూర్తి చేసి ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు కృషి చేస్తాం. ఆర్డీఎస్ ఆయకట్టు పెండింగ్ పనులతోపాటు నెట్టెంపాడ్ ప్రాజెక్టు పరిధిలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్, 99, 100 ప్యాకేజీ పనులను పూర్తి చేసి నియోజకవర్గ పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందింస్తాం.