
మహబూబ్‌నగర్‌టౌన్ డిసెంబర్ 21: మహబూబ్‌నగర్ పట్టణంలో నిర్మిస్తున్న శిల్పారామం, మినీ ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులతోపాటు హోటల్ నిర్మాణ పనులు పక్కాగా జరగాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో అధికారులతో సమీక్షించారు. మహబూబ్‌నగర్‌లో నిర్మిస్తున్న సుందరీకరణ పనులు జూన్ 2, 2022లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు ఉన్నారు.
స్కీల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేయాలి
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఎంఎస్ఎంఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేకంగా చర్చించారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు వృత్తి శిక్షణను ఇవ్వడానికి కేంద్రం ప్రభుత్వ వృత్తి శిక్షణ సంస్థ ఎంఎస్ఎంఈను ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. మహబూబ్‌నగర్‌లో సుమారు 15వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన వృత్తి కేంద్రం ఏర్పాటుకు సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు. ఎంఎస్ఎంఈ డైరెక్టర్ జనరల్ చంద్రశేఖర్ ఆధునిక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులకు కార్పొరేట్ కంపెనీల్లో ప్లేస్మెంట్ కల్పించడం జరుగుతుందన్నారు. ఎంఎస్ఎంఈ ఆధునిక శిక్షణ కేంద్రాన్ని జిల్లాలో ఏర్పాటు చేయడం వల్ల వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఈ సందర్భంగా తెలిపారు.
పాలమూరుకు కొత్త కళ
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా వేసిన ప్రధాన రోడ్డు మధ్యలో డివైడర్లు, మొక్కలు నాటేందుకు చేస్తున్న పనులను మంగళవారం అర్ధరాత్రి 12:45 గంటలకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. పట్టణంలోని పద్మావతి కాలనీలో పనులను చూసి నాణ్యతగా చేపట్టాలని సూచించారు. వంద సంవత్సరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనులు చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు విస్తరణ, జంక్షన్ల అభివృద్ధితో పాలమూరుకు కొత్తకళ వచ్చిందన్నారు. పట్టణాభివృద్ధే తన ముందున్న లక్ష్యమన్నారు.