సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలో విప్ గువ్వల బాలరాజుతో కలిసి మంత్రి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మన్ననూర్‌లో తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రం, చెంచులక్ష్మి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లోభారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించి, బీఆర్ఎస్ సరార్ను ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అమ్రాబాద్, మే 16 : సీఎం కేసీఆర్ కారణజన్ముడని మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో రూ.90లక్షల వ్యయంతో నిర్మించిన డయాగ్నొస్టిక్ కేంద్రం, రూ.40లక్షలతో పునఃనిర్మాణం చేసిన చెంచులక్ష్మి రెస్టారెంట్లను ఆమె ప్రారంభించారు. ముందుగా మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం పొందారు. అంతకుముందు ప్రభుత్వ విప్ గువ్వల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కులాలు, మతాలు, వర్గాలు అన్న తేడా లేకుండా అందరికీ న్యాయం చేసేలా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. గిరిజనులు అధికంగా ఉన్న నల్లమల ప్రాంతంలో ప్రత్యేకంగా వైద్యసేవలు అందించేందుకు డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. వైద్యులు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతమైన నల్లమలలో పర్యాటకులను ఆకర్షించేలా అన్ని వసతులు కల్పిచేందుకు చర్యలు తీసుకుంటున్నమన్నారు.
వేగంగా అభివృద్ధ్ది చెందుతున్న తెలంగాణపై రాబంధుల్లా ఇతర పార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ ప్రజల్లో మతం పేరుతో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. ఏండ్లుగా పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు తీరని అన్యాయం చేసి ఆకలిచావులకు కారణమైందన్నారు. ప్రజలు ఆలోచించాలని, మాయమాటలను నమ్మితే మళ్లీ అభివృద్ధిలో వెనుకబడిపోవాల్సి వస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని.. ప్రజలు మరోసారి ఆశీర్వదించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేసీఆర్, న్యూట్రీషన్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, చెన్నకేశవులు, మన్ననూర్ సర్పంచ్ శ్రీరాంనాయక్, ఎంపీపీ శ్రీనివాసులు, జెడ్పీటీసీ రాంబాబునాయక్, ఎంపీటీసీ దాసరి శ్రీనివాసులు, డాక్టర్ సుధాకర్, సిబ్బంది లోక్య, పార్వతి, అశోక్‌ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు రవికుమార్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
బీటీ రోడ్డు పనులు ప్రారంభం..
బల్మూరు, మే 16 : మండలంలోని అచ్చంపేట-బల్మూరు రోడ్డు నుంచి గోపాల్రావునగర్తండా బీటీ రోడ్డుకు రూ.కోటీ 12.5లక్షలు, రాంనగర్‌తండా నుంచి పొలిశెట్టిపల్లి వరకు రూ.కోటీ 12.5లక్షలతో బీటీ రోడ్డు పనులకు గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మంగళవారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సీఈ శంకర్, ఎస్ఈ జగత్ జ్యోతి, ఎంపీపీ అరుణ, జెడ్పీటీసీలు లక్ష్మిరెడ్డి, మత్రునాయక్, సర్పంచ్‌లు శ్రీరాంనాయక్, సువర్ణ అశోక్‌రావు, కృష్ణయ్య, ఎంపీటీసీ ఆంజనేయులు, సింగిల్ విండో చైర్మన్ నర్సయ్య, తాసీల్దార్ కిష్ట్యానాయక్, ఎంపీడీవో దేవన్న, కార్యదర్శి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు..
మండలంలోని రాంనగర్‌తండాలో గ్రామానికి చెందిన బీఎస్పీ కార్యకర్తలు మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సమక్షంలో దాదాపు 20 మంది బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.