
మహబూబ్‌నగర్, డిసెంబర్ 17 : ఉద్యోగుల స్థానిక క్యాడర్ కేటాయింపులకు సం బంధించిన వివరాలను ఎప్పటికప్పుడు స మర్పించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో క లెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేర కు స్థానిక క్యాడర్ కేటాయింపుతోపాటు ఉ ద్యోగులకు ఉత్తర్వుల అందజేత తదితర ప నులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉద్యోగులు మాస్టర్ డేటా ప్ర కారం ఎంట్రీ చేసిన వివరాలు, ఉత్తర్వులు అందుకున్న వారి వివరాలను కలెక్టర్ కార్యాలయానికి చేరవేయాలని సూచించారు. స మావేశంలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు ఉన్నారు.
వసతిగృహాల్లో సీట్ల సంఖ్య పెంపు
జిల్లాలోని ఎస్సీ కళాశాల వసతిగృహాల్లో సీట్ల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కలెక్టర్ వెంకట్రావు ప్రకటనలో తెలిపారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని అన్ని ఎస్సీ కళాశాల వసతిగృహాల్లో 150నుంచి 200మంది వి ద్యార్థులను తీసుకునేందుకు అనుమతిని స్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ ఉత్తర్వు లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. వసతిగృహా ల్లో సీట్ల పెంపునకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. ప్ర భుత్వ ఎస్సీ బాలికల-ఏ వసతిగృహంలో 150మంది, బాలుర ఎస్సీ-ఏ వసతిగృహం లో 150, బాలుర ఎస్సీ-సీ వసతిగృహం లో 150వరకు, జడ్చర్ల బాలికల ఎస్సీ కళాశాల వసతిగృహంలో 150, మహబూబ్‌నగర్ బాలికల ఎస్సీ వసతిగృహంలో 200 మందివరకు విద్యార్థులను చేర్చుకునేందు కు అనుమతి లభించిందన్నారు. ఈ మేరకు ఎస్సీ కళాశాల పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లల్లో 150 నుంచి 200మందిని చేర్చుకునేందుకు చర్య లు తీసుకుంటున్నట్లు తెలిపారు.