గద్వాల : జిల్లాలో పలు ప్రైవేట్ విద్యాసంస్థలు( Private Schools) నిబంధనలకు విరుద్ధంగా టెక్ట్స్, నోట్ పుస్తకాలు విక్రయాన్ని అడ్డుకోని డీఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు (Student unions) డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్వీ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హాలీమ్ పాషా, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు దానయ్య తదితరులు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఐజ మండల కేంద్రంలోని శ్రీకృష్ణవేణి ప్రైవేట్ స్కూలు, జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో కరికులం ప్రైవేట్ స్కూలు, మల్దకల్ మండలంలోని న్యూ ట్రినిటీ ప్రైవేట్ స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా బుక్కులు అమ్ముతుంటే విద్యార్థి సంఘాలుగా తాము పట్టించామని పేర్కొన్నారు. పట్టుకున్న పుస్తకాలను ఎంఈవోలు సీజ్ చేశారని తెలిపారు. అయితే మళ్లీ పాఠశాలలను దర్జాగా పుస్తకాలు విక్రయిస్తున్నారని ఆరోపించారు.