ఎకరాకూ రూ.60 లక్షలు ఇవ్వాలి
ఎకరాకు రూ.60 లక్షలు చెల్లించాలని, కోల్పోయే భూమికి బదులు మరోచోట భూము లు కొనుగోలు చేసి ఇవ్వాలని, అలాగే కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు డిమాండ్ చేశారు.
- ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి
- పేట-కొడంగల్ లిఫ్ట్‌లో భూములు కోల్పోతున్న రైతుల డిమాండ్
- ఊట్కూరు మండలంలో గ్రామ సభలు
ఊటూర్, మే 12 : ఎకరాకు రూ.60 లక్షలు చెల్లించాలని, కోల్పోయే భూమికి బదులు మరోచోట భూము లు కొనుగోలు చేసి ఇవ్వాలని, అలాగే కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు డిమాండ్ చేశారు. ఎత్తిపోతలలో భాగంగా భూసేకరణ సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో సోమవారం నారాయణపేట ఆర్డీవో రాంచందర్ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. ఊటూర్ మండలం బాపురం, తిప్రాస్‌పల్లి, పులిమామిడి, జీర్ణహళ్లి, పెద్దపొర్ల గ్రామాల్లోని సభలకు సంబంధిత శాఖాధికారులు హాజరయ్యారు. ముందు గా ఓపెన్ కెనాల్, పైపులైన్, సంప్‌హౌస్, విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణాల్లో భూములు కోల్పోయే రైతుల వివరాలను గ్రామసభలో చదివి వినిపించారు. ఈ సందర్భం గా ఆర్డీవో మాట్లాడుతూ ఎత్తిపోతల్లో భాగంగా భూత్పూర్ రిజర్వాయర్ ద్వారా ఊటూర్ పెద్ద చెరువు, నారాయణపేట మండలం పేరపళ్ల జాయమ్మ చెరువుకు సాగునీరు అందించేందుకు సర్వే పూర్తి చేశామని తెలిపారు.
సర్వేపై రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భా గంగా భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అం దించి ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వే పూర్తి చేయడంతో కొలతల్లో తేడాలు ఉన్నాయని, రీ సర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సర్వే పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా పరిహారం చెల్లింపు విషయాన్ని ప్రభుత్వం చెప్పడం లేదని, మరో నెల రోజు ల్లో వానకాలం పంట సాగుకు పొలాలను సిద్ధం చేయాల్సి ఉందన్నారు. అధికారులు భూ సేకరణ చేపడితే పెట్టుబడులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో తాసీల్దార్ చింత రవి, ఇరిగేషన్ ఫేజ్ -1, ఫేజ్-2 డీఈలు చేతన్, వెంకటరమణ, ఏఈఈ సురేశ్, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్రారెడ్డి, ఆర్ఐ, ఏవో పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

