పాలమూరు, జూన్ 19: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని స్థానిక ఎంవీఎస్ డిగ్రీ కళాశాల యూజీ డిగ్రీ సెమిస్టర్ 2,4,6 సెమిస్టర్ రెగ్యులర్, 1,2, 3,4,5,6 సెమిస్టర్ బ్యాగ్‌లాగ్ ఫలితాలు బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి ఆధ్వర్యంలో పీయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాలలో రెండో సెమిస్టర్లో 919 మందికి, 355 మంది విద్యార్థులు, నాలుగో సెమిస్టర్లో 935 మంది విద్యార్థులకు 489మంది విద్యార్థులు, ఆరో సెమిస్టర్లో 919మంది విద్యార్థులకు 812 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే ద్యార్థులు ఫలితాలను ఎంవీఎస్ డిగ్రీ కళాశాల వెబ్సైట్లో చూసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.కార్యక్రమంలో పీయూ పరీక్షల నియంత్రణ అధికారి రాజ్‌కుమార్, స్పెషల్ ఆఫీసర్ నా గభూషణం, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, విజ య, ఎంవీఎస్ వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణగౌడ్, ఈశ్వరయ్య, రాములు, హరి, ప్రసాద్, మల్లికార్జున్, సూర్యనారాయణ, తిరుపతయ్య పాల్గొన్నారు.