మక్తల్ టౌన్, జనవరి 4 : ఓటమి గెలుపునకు నాంది అ ని, గెలిచిన వారు సంతోష పడకుండా ఓడిన వారు అ ధైర్యపడకుండా క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా మాస్టర్ ఆధ్వర్యంలో మక్తల్ జూనియర్ కళాశాల గ్రౌండ్లో మంగళవారం నిర్వహించిన అథ్లెటిక్స్‌లో గెలుపొందిన వారికి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో గెలుపొందిన వారికి బుధవారం మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ 30 నుంచి 100 ఏండ్ల లోపు వారికి అథ్లెటిక్స్‌లో క్రీడలు నిర్వహించడం చాలా సంతోషమన్నా రు.
ప్రతిఒక్కరూ క్రీడలు ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతోపాటు ఉత్సాహంగా ఉంటామన్నారు. జిల్లాస్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయి క్రీడలకు వెళ్తున్న క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. జిల్లాస్థాయి క్రీడల్లో గెలుపొందిన వారు 5న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గ్గొంటారని తెలంగాణ షూ టింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.గోపాలం తెలిపారు. కార్యక్రమంలో సీఐ సీతయ్య, మాస్టర్ అథ్లెటిక్స్ జిల్లా అధ్యక్షుడు సత్యాంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
పనులు పూర్తి కావాలి
పట్టణ ప్రగతిలో భాగంగా మక్తల్ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేస్తు న్న లవ్ మక్తల్, లైటింగ్ బోర్డు, గార్డెనింగ్ పనులను ఎమ్మెల్యే బుధవారం పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి సంక్రాంతి పండుగ లోపు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఏఈఈ నాగశివను ఆదేశించారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను పట్టణంలోని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రె డ్డి నివాసంలో సంఘం నాయకులు, మండల ఉపాధ్యాయులతో కలిసి బుధవారం నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊ రు మన బడి కార్యక్రమంతో పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించిం దన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు తమ వృత్తికి న్యాయం చేసి విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే అన్నారు. కా ర్యక్రమంలో ఎంఈవో లక్ష్మీనారాయణ, పీఆర్టీయూ టీఎస్ జిల్లా కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శలు, ఉపాధ్యాయులు ఉన్నారు.