అచ్చంపేట, జనవరి 17 : రోజురోజుకు ఆన్లైన్లో అనేక మోసాలు జరుగుతున్నా ప్రజలు ఇంకా మేల్కోనడం లేదు. సులభంగా డబ్బులు వస్తాయనే అత్యాశతో ఎవరోచెప్పిన దానికి నమ్మి ఆన్లైన్ యాప్లో డబ్బులు పెట్టి మోసపోతున్నారు. అమాయకుల నుంచి పెట్టుబడి పెట్టించి న తన్విత గ్రూప్ చేసిన భారీ మోసం మరువకముందే.. డెకత్లాన్ యాప్ పేరుతో మరో భారీ మో సం బయటపడింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మించి అమాయక ప్రజల నుంచి ఆన్లైన్లో డబ్బులు పెట్టించారు. రూ.650 నుంచి రూ.లక్షా 50వేల వరకు ఈ యాప్లో గత నాలుగు నెలలుగా డబ్బులు పెట్టించారు.
అచ్చంపేట, పదర, అమ్రాబాద్, బ ల్మూర్, ఉప్పునుంతల, కల్వకుర్తి పట్టణాలు, గ్రా మాల్లో ప్రజలు నమ్మి యాప్లో డబ్బులు పెట్టా రు. ఇందులో ఉద్యోగులు, వ్యాపారస్తులు, వి ద్యావంతులు, పోలీసులు, రైతు లు, అమాయక ప్రజలు కూడా డబ్బులు పెట్టి మోసపోయినట్లు గ్రహించారు. అయితే బయటచెప్పడానికి ఎవరూ ముందుకురావడం లేదు. బయటపడితే ఎ క్కడ తమపేరు బయటకు వ స్తుందోనని చెప్పడం లేదు. అ చ్చంపేట ప్రాంతంలోనే దా దాపు రూ. కోటికిపైగా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. యాప్ లో రూ.50వేలు పెట్టుబడి పెడి తే రోజుకు రూ.3వేలు చొప్పున 30రోజులపాటు, రూ.లక్ష పెట్టుబడి పెడితే రోజకు రూ. 5వేల చొప్పున 30రోజులు ఈ విధం గా ఎంతపెట్టుబడి పెడితే అంత రోజువారీగా ఇచ్చేవిధంగా రూ.1.50 లక్షల వర కు పెట్టారు. నియోజకవర్గానికి చెందిన ఒకరైతు ప త్తి అమ్మగా వచ్చిన డబ్బులలో వారం కింద రూ.లక్షా 50వేలు పెట్టినట్లు తెలిసింది.
కొందరికి ప్రతిరోజూ డబ్బులు వస్తుండడంతో నమ్మిన మరికొందరు పెద్దఎత్తున డిపాజిట్ పెట్టారు. లక్ష డిపాజిట్ చేస్తే నెలరోజుల్లో రూ.60వేలు అదనంగా వస్తున్నాయనే నమ్మి డిపాజిట్ చేశారు. ప్రజల్లో నమ్మకం కల్గించి పె ద్దమొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత యాప్ ను తొలగించారు. మొదట్లో నమ్మించేందుకు కొన్నిరోజు లు డబ్బులు ఇచ్చినట్లు న మ్మించారు. తీరా పెద్దమొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత డెకత్యాప్ ఓపెన్ కావడం లేదు. దీంతో యాప్లో డిపాజిట్ పెట్టి మోసపోయాని తెలియడం తో బాధితులు ఆందోళన చెందుతున్నారు. డెకత్యా ప్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఓపెన్కావడం లేదు దానిస్థానం లో మరోయాప్ వచ్చింది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకునేందుకు రూ.వెయ్యి చెల్లించాలని చెబితే బాధితులు పెట్టిన డబ్బులు అయిన వస్తాయనే నమ్మి ఆ యాప్ కోసం రూ. వెయ్యి చెల్లించి మరోసారి మోసపోయారు. ఈ విధంగా ఆన్లైన్ మోసాలు కండ్లముందే జరుగుతున్నాయి. మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లు పుట్టుకోస్తూనే ఉంటారనే నానుడి నిజం చేస్తున్నారు.