మహబూబ్‌నగర్, నవంబర్ 22 : వారంతా ఒక తండాకు చెందిన యువకులు తల్లిదండ్రులు చదువురాకపోవడంతో వారిని నమ్మించి మేము సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నామని ల్యాప్‌టాప్ లు, మొబైల్ ఫోన్లతో తిరుగుతూ అడ్డదారిలో డబ్బులను సంపాదించాలనే పథకంతో అమాయక ప్రజలను బురిడీ కొట్టించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నా నిందితుల ఆట కట్టించి ఏడుగురు నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ జానకి తెలిపారు. శనివారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె సైబర్ నేరగాళ్లకు సంబంధించిన కేసు వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ టుటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని వాకిటి వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితుల కేసు ఛేదించేందుకు సాంకేతిక విశ్లేషణ ద్వారా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికాగోయాల్ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్, వనపర్తి టీము ల సహకారంతో సాంకేతిక ఆధారాలను సమగ్రంగా విశ్లేషించి శనివారం ఉద యం నిందితుల లోకేషన్లను ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. లక్షా 50 వేలు నగదు, 2 ఆన్డ్రైడ్ మొబై ల్స్, 7 సెల్ ఫోన్లు, బైక్, ఆటోను సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. మహబూబ్‌నగర్ మండలంలోని తువ్వగండాతండాకు చెందిన జర్పుల సురేందర్, కాట్రవత్ హనుమంతు, వడ్త్యారాజు, వడ్త్యా భాస్కర్, కాట్రవత్ నరేశ్, రాత్లావత్ సం తోష్, రాత్లావత్ సోమలు తువ్వగండా, జైనల్లిపూర్ గ్రామానికి చెందినవారు. సాధారణంగా ఆటో డ్రైవింగ్, టైల్స్ వ ర్క్, మేషన్, ప్లంబర్ పనులు చేసుకుం టూ జీవనం సాగించే వీరందరూ ఒకే కులానికి చెందినవారని ఎస్పీ తెలిపారు.
అయితే ఫేస్బుక్లో ధన ఫైనాన్స్ పేరుతో కనిపించిన ప్రకటనను నమ్మించి తన పాన్ కార్డు, ఆధార్ కార్డు నమోదు చేయ గా నిందితుల వాటిని డౌన్లోడ్ చేసి నకిలీ ఫేక్‌లోన్ మంజూరు లెటర్ రూ పొందించి పంపారు. అనంతరం లోన్ మంజూరైందని ఫిర్యాదుదారునికి హ న్మంతు అలియాస్ అంజి మిగతా నిం దితులు కాల్ చేసి ప్రాసెసింగ్ ఫీజు, ఇ న్సూరెన్స్, జీఎస్టీ , టీడీఎస్, మొదటి ఈ ఎంఐ పేర్లతో మొత్తం రూ.75,655 తీ సుకున్నారు. తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చే యడంతో ఎటువంటి స్పందన లేనందున టుటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యా దు చేయడం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ నిర్వహించి నిందితులను పట్టుకున్నట్లు వివరించా రు.
కేసు దర్యాప్తులో భాగంగా నిందితు లు సురేందర్, హనుమంతు అక్రమం గా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మొదట కలకత్తాలో సైబర్ నేరగాళ్లు వద్ద శిక్షణ పొంది, ఆ తర్వాత తమ తండాకు చెందిన ఇతర యువకులకు కూడా కాల్ సెంటర్ పేరుతో అక్రమంగా డబ్బు వ సూళ్లు చిన్న మొ బైల్ పరికరాల ద్వారా లోకేషన్ దాచే విధానాలు తెలుసుకున్న ట్లు , దాని ద్వారానే సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ కేసు ఛే దించిన వారిలో టుటౌన్ సీఐ ఏజాజుద్దీ న్, రూరల్ సీఐ గాంధీనాయక్, రూ రల్ ఎస్సై విజయ్, వనపర్తి సైబర్ సెక్యూరీటి బ్యూరో ఎస్సై రవి ప్రకాశ్, మహబూబ్‌నగర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో శ్రావణ్‌కుమార్, మహేశ్, సాయి, మ హేంద్ర, పవన్ కుమార్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి పాల్గొన్నారు