మహబూబ్‌నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మహబూబ్‌నగర్/మెట్టుగడ్డ/టౌన్, మే 14: కనీవినీ ఎరుగని రీతిలో ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన లభించింది. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు విక్రయదారులు జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ శ్రీజయరామ, సిరిసంపద ప్రధాన స్పానర్లతోపాటు గిరిధారి, దేవాస్ ఇన్ఫ్రా ఎంవీపీ స్పేసెస్, స్కంధాన్షి, కామాక్షి, రెయిన్బో డెవలపర్స్ ఆగ్రో ఫార్మర్స్ ప్రముఖ రియల్ ఎస్టేట్స్ రంగ దిగ్గజాల సహకారంతో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’, ‘టీ న్యూస్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన లభించింది.
ఈ ప్రాపర్టీ షోను మహబూబ్‌నగర్ కలెక్టర్ ఎస్. వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రజలకు నమ్మకం కల్గించి వ్యాపారం చేసుకోవాలని అప్పుడే వినియోగదారుల్లో నమ్మకం పెరుగుతుందని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, రైతుంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, ‘నమస్తే తెలంగాణ’ మహబూబ్‌నగర్ బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్, ఎడిషన్ ఇన్చార్జి పి.సత్యనారాయణరెడ్డి, బ్యూరో ఇన్చార్జి విజయభాస్కర్, ఏడీవీటీ అసిస్టెంట్ మేనేజర్ విజయ్‌కుమార్‌రెడ్డి, సర్యులేషన్ మేనేజర్ జగన్, సబ్ఎడిటర్ జన్ను నవీన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
వేగంగా అభివృద్ధి
నేను మహబూబ్‌నగర్‌లో జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న సమయంలో పెద్ద గ్రామంగా అనిపించింది. అప్పుడు తాగునీటితోపాటు అనేక సమస్యలకు నిలయంగా ఉండేది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక శ్రద్ధతో తక్కువ సమయంలోనే మహబూబ్‌నగర్ హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చెందుతూ వస్తున్నది. పట్టణం చుట్టూ రోడ్డు మార్గాలు నిత్యం తాగునీరు, రోడ్ల విస్తరణతోపాటు అనేక విధాలుగా మహబూబ్‌నగర్ అభివృద్ధి చెందినది. రియల్ ఎస్టేంట్ రంగం ఎంతో అభివృద్ధి చెందినది. గుర్తింపు పొందిన సంస్థల ద్వారా ప్లాంట్లు కొనుగోలు చేసి గుర్తింపు పొందిన బ్యాంకులతో రుణాలు తీసుకోవాలి. సులభ వాయిదాలను చెల్లించి ఇండ్లను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ‘నమస్తే తెలంగాణ’ పేపర్లో ఉద్యోగాలకు సంబంధించి ప్రతి రోజు నిపుణ అందించడం చాలా బాగుంది. కోచింగ్‌కు వెళ్లకుండా ఇంటి వద్దే పోటీ పరీక్షలకు సిద్ధమై ఉద్యోగం సాధించేందుకు వీలుంది. ‘తెలంగాణ టుడే’ పేపర్ ఎంతో అద్భుతంగా ఉంది. ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసినందుకు ‘నమస్తే తెలంగాణ’కు అభినందనలు.
– ఎస్.వెంకట్రావు, కలెక్టర్, మహబూబ్‌నగర్
మంచి మార్కెట్ ఉంది..
హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోయిందో మహబూబ్‌నగర్ సైతం ఆ దిశగా ముందుకు సాగుతుందని భావించి ఇక్కడ పెట్టుబడులు పెట్టాం. ఇక్కడ మంచి మార్కెట్ ఉండడంతోపాటు ప్లాట్ల విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అన్ని వసతులతో వెంచర్లను ఏర్పాటు చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాం. నమ్మకానికి మారుపేరుగా రియల్ ఎస్టేట్ రంగంలో కొనసాగుతున్నాం.
– బాలకృష్ణ, సిరిసంపద జనరల్ మేనేజర్
‘రియల్’ ఊపందుకుంది
ఎక్సైజ్ శాఖ శ్రీనివాస్‌గౌడ్ శ్రమించి పాలమూరును ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగానే రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందింది. మహబూబ్‌నగర్ గతానికి ప్రస్తుతానికి చాలా తేడా ఉంది. అతి పెద్ద కంపెనీలు సైతం మహబూబ్‌నగర్ వైపు చూస్తున్నాయి. వివిధ ప్రాంతాల అభివృద్ధితోనే రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది. తాగునీరు, అవసరమైన సదుపాయాల కల్పనతోపాటు వసతులు పెరగడంతో ఇక్కడ అత్యధికంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు.
– బెక్కరి రాఘవేందర్‌రెడ్డి, శ్రీ జయరామ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్
మంచి స్పందన
నిరుద్యోగులకు అండగా ఉండేందుకుగానూ ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. స్టడీ మెటీరియల్‌ను అందించేందుకు చర్యలు చేపట్టాం. నిరుద్యోగులకు నాణ్యమైన మెటీరియల్‌ను ప్రతి రోజు దిన పత్రికలో ‘నిపుణ’ పేరుతో అందజేస్తున్నాం. దాదాపు ఇప్పటికే 50వేల ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. నిరుద్యోగులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. మహబూబ్‌నగర్‌లో నమస్తే తెలంగాణ ద్వారా ప్రాపర్టీషోను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ప్రాపర్టీ షోకు మంచి స్పందన లభిస్తున్నది.
– సురేందర్‌రావు, నమస్తే తెలంగాణ, జనరల్ మేనేజర్
సద్వినియోగం చేసుకోవాలి..
‘నమస్తే తెలంగాణ’ ప్రాపర్టీ షోను తీసుకొచ్చి ప్రజలకు ఎంతో చేసింది. అందుబాటులో ఒకే చోట అన్ని సంస్థలు చేర్చడం చాలా మంచి విషయం. గుర్తింపు ఉన్న వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్ని విషయాలను పూర్తిస్థాయిలో తెలుసుకొని ప్లాట్లను కొనుగోలు చేయాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత ‘నమస్తే తెలంగాణ’ అందజేస్తున్న ‘నిపుణ’ప్రత్యేక పేజీలను సద్వినియోగం చేసుకోవాలి.
– స్వర్ణసుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్
వేగంగా మహబూబ్‌నగర్ అభివృద్ధి..
రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మహబూబ్‌నగర్ మొదటి స్థానంలో ఉంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో రియల్ ఎస్టేట్‌తోపాటు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నది. ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయడం అభినందనీయం. పోటీ పరీక్షలకు సిద్ధ్దం అవుతున్న యువత ‘నిపుణ’ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకోవాలి.
– వెంకటేశ్వర్లు, ఎస్పీ, మహబూబ్‌నగర్
ప్రాపర్టీ షో ఉపయోగకరం
‘నమస్తే తెలంగాణ’ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసి మంచి పనిచేసింది. ఎంతో మంది మార్కెట్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో తెలియక ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయారు. ఇలా అన్ని వసతులు ఎలాంటి ఇబ్బందులు లేని ప్లాట్లు అందుబాటులోకి తీసుకొచ్చి ప్లాట్లు, రుణాలు అందించేందుకు బ్యాంకుల వారిని ఆహ్వానించి సొంతింటి కలను నెరవేర్చడం గొప్ప విషయం.
– కేసీ నర్సింహులు, మున్సిపల్ చైర్మన్, మహబూబ్‌నగర్
రూ.4వేల నుంచి రూ.50వేలకు ..
మహబూబ్‌నగర్‌లో తెలంగాణ రాకముందు రూ.4వేల గజం ఉన్న ప్లాట్లు ప్రస్తుతం రూ.50వేలకు పైగా చేరాయి. ఇది అంత సులభమైన విషయం కాదు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రాత్రి, పగలు శ్రమించి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. నిర్మాణాలను నాణ్యతతో చేపడుతున్నారు. మహబూబ్‌నగర్ అభివృద్ధి చెందడంతో ఇతర ప్రాంతాల నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారు.
– రాజేశ్వర్, మాజీ మర్కెట్ కమిటీ చైర్మన్
షో చాలా బాగుంది..
ప్లాట్లు అమ్మేవారిని, రుణాలు అందించే బ్యాంకర్లను ఒకే దగ్గరకు చేర్చి ప్రజలకు మంచి అవకాశం కల్పించారు. గుర్తింపు ఉండడంతో అన్ని నిబంధనలను పాటించి ప్రజలకు ప్లాట్లు అందుబాటులో ఉండడంతో కొనుగోలు చేసేందుకు మంచి అవకాశంగా ఉంది. ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసినందుకు ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ధన్యవాదాలు.
– ఎండీ. నజీరొద్దీన్, మహబూబ్‌నగర్
మొదటి సారి చూస్తున్నా..
నాకు తెలిసినంత వరకు మహబూబ్‌నగర్‌లో ప్రాపర్టీ షోను ఇలా ఏర్పాటు చేయడం తొలిసారిగా చూస్తున్నా. ప్లాట్లు కొనుగోలు చేసే వారికి ఇది ఒక మంచి వేదిక. అన్ని సంస్థలు ఒకే దగ్గర ఉండడంతో ధరలు పోల్చి చూసుకోవచ్చు. ఏది మంచిగా ఉంటే అది కొనుగోలు చేసేందుకు వీలుంటుంది.
– స్వదేశ్, అడ్వకేట్, క్రిష్టియన్‌పల్లి, మహబూబ్‌నగర్
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
బ్యాంకులు, రియల్ ఎస్టేట్‌లో పెద్ద కంపెనీలు అందుబాటులో ఉండడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇరుకు రోడ్లతో కొనుగోలు చేసి ఇబ్బందులు పడకుండా గుర్తింపు సంస్థల్లో కొనుగోలు చేయడం ఎంతో మేలు. అన్ని రకాల సౌకర్యాలు చూసుకొని ప్లాట్లు కొనుగోలు చేయొచ్చు.
– శ్రీనివాస్, ఉపాధ్యాయుడు, మహబూబ్‌నగర్
ప్రత్యేకంగా ఉంది
అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలను ఒక వద్దకు చేర్చి ప్రత్యేకంగా షో ఏర్పాటు చేయడం చాలా బాగుంది. కొనుగోలు చేసేందుకు చాలా సులభంగా ఉంది. మాకు నచ్చిన ప్రాంతంలో ప్లాట్‌ను కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇక్కడ కొనుగోలు చేయడం ద్వారా పూర్తి భరోసా ఉంటుంది.
– యాదయ్య, న్యూగంజ్, మహబూబ్‌నగర్