మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 3 : జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెందిన ప్రశాంత్ హోటల్లో శుక్రవారం బిర్యానిలో బొద్దింక రా వడం కలకలం రేపింది. చికెన్ బిర్యాని తిం టున్న కస్టమర్ చివరిలో బొద్దింకను చూసి షాకయ్యాడు. ఇదేంటని హోటల్ సర్వేంట్ను నిలదీయగా.. తన యజమానికి విషయాన్ని తె లియజేశాడు.
యజమాని వచ్చి ఇలాంటి చిన్నవాటిని పట్టించుకోవద్దని బిల్లు చెల్లించాల్సిం దే.. అంటూ దబాయించి వినియోగదారుడుతో బిల్లు కట్టించుకొని తోసేశారు. దీంతో బిర్యానిలో వచ్చిన బొ ద్దింకను వినియోగదారుడు ఫొటో తీసుకుని నేరుగా జిల్లా ఫుడ్ ఇ న్స్పెక్టర్కు ఫిర్యాదు చేశా డు.
అనంతరం వినియోగదారుల ఫోరంలో కూడా ఫిర్యాదు చేస్తానని వెల్లడించాడు. కల్తీ, అపరిశుభ్రంతో ప్రతి రోజు హోటళ్లపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నా ఫుడ్ ఇన్స్పెక్టర్లు మాత్రం తూ తూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారని వినియోగదారులు మండిపడారు.