అయిజ, ఫిబ్రవరి 18 : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మండలంలోని ఉత్తనూర్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నాలుగు రోజులుగా నిర్వహించిన అం తర్రాష్ట్ర పశుబల ప్రదర్శన, బాస్కెట్‌బాల్ టోర్నీ ఆదివారం ముగిసింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయుడు హాజరై విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పశుబల ప్రదర్శన పోటీల నిర్వహణ లో ఉత్తనూర్కు ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. కీ.శే. పులకుర్తి తిరుమల్‌రెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు ఆయన తనయుడు గౌతంరెడ్డి, రామచంద్రారెడ్డి కృ షి చేయడం అభినందనీయమన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే ధన్వంతరి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో ప్ర జాప్రతినిధులు, నాయకులు, దేవస్థాన కమిటీ సభ్యులు, క్రీడాకారులు, రైతులు పాల్గొన్నారు.