పోటెత్తిన భక్తజనం
అమావాస్యను పు రస్కరించుకొని కర్ణాటక రాష్ట్రం కళబెళగుందె క్షేత్రంలో వెలిసిన బనదేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యే క పూజలు నిర్వహించారు. స్వామివారికి రుద్రాభిషేకం, శాశ్వత రుద్రాభిషేకం, బిల్వార్చన, అష్టోత్తర శతనామావళి, అలంకార పంక్తి, నైవేద్యం, మహామంగళహారతి, సర్వదర్శ నం, తీర్థప్రసాద వితరణ చేశారు. బల్చక్రం గ్రామానికి చెం దిన భక్తులు అన్నదానం ఏర్పాటు చేశారు.
- ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఊరేగింపు
- భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం
- అమావాస్య సందర్భంగా సందడి
నారాయణపేట టౌన్, జనవరి 21 : అమావాస్యను పు రస్కరించుకొని కర్ణాటక రాష్ట్రం కళబెళగుందె క్షేత్రంలో వెలిసిన బనదేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యే క పూజలు నిర్వహించారు. స్వామివారికి రుద్రాభిషేకం, శాశ్వత రుద్రాభిషేకం, బిల్వార్చన, అష్టోత్తర శతనామావళి, అలంకార పంక్తి, నైవేద్యం, మహామంగళహారతి, సర్వదర్శ నం, తీర్థప్రసాద వితరణ చేశారు. బల్చక్రం గ్రామానికి చెం దిన భక్తులు అన్నదానం ఏర్పాటు చేశారు. మహిళలు, భక్తు లు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నా రు. మొక్కులు చెల్లించుకున్నారు.
ఘనంగా ఆరాధన ఉత్సవాలు
పట్టణంలోని రాఘవేంద్రస్వామి మఠంలో శనివారం పురందరదాసుల ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అర్చకుడు నర్సింహాచారి ప్రత్యేక పూజలు చేశారు. పళ్ల పురవీధుల్లో హరిదాసుల సంకీర్తనలతో గోపాలం కార్యక్రమం నిర్వహించారు. వినాయక, అనంతసేన, ఆంజనేయస్వామి ఆలయాల్లో భజనలతో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాఘవేంద్ర సేవా సమితి సభ్యులు రాఘవేంద్రరావు, సీతారాం దీక్షిత్, ధరణీధర్ దీక్షిత్, అనంతరా వు, మంజునాథ్ జోషి, రఘునాథ్ జోషి పాల్గొన్నారు.
మంథన్గోడ్లో..
మక్తల్ టౌన్, జనవరి 21 : మండలంలోని మంథన్గోడ్లో కొప్పేశ్ ఆచారి స్వగృహంలో పురందరదాసుల ఆరాధన ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. పం డితులు రఘుప్రేమాచార్యులు, ప్రశాంతా చార్యులు ప్రత్యేక పూజలు చేసి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలను అందించారు. కార్యక్రమం లో పండితులు యోగేశాచార్యులు, జయ తీర్థాచార్యులు, రంగనాథాచార్యులు, కొప్పణాచార్యులు, సత్యనారాయణతోపాటు బ్రాహ్మణులు పాల్గొన్నారు.
ఆలయంలో అన్నదానం
అన్నదానం చేయడంతో మానవ జీవితానికి ఎంతో పు ణ్యం లభిస్తుందని ఆలయ ధర్మకర్త భీమాచారి అన్నారు. అమావాస్య సందర్భంగా మండలంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తుల సహకారంతో అన్నదానం చేపట్టారు. ఆలయ ప్రాంగణంలోని అన్నదాన సత్రంలో మక్తల్ 9వ వార్డు సభ్యురాలు వాకిటి రాధికా శేషగిరి, పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ, ఎంఆర్ఎఫ్ షో రూమ్ మల్లారెడ్డి సౌజన్యంతో భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రాణేశాచారి, అరవింద్, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
రంగస్వామి ఆలయంలో..
మక్తల్, జనవరి 21 : మండలంలోని కర్నిలో వెలిసిన గుంటి రంగస్వామి ఆలయంలో శనివారం అమావాస్యను పురస్కరించుకొని భక్తులకు రమేశ్, సావిత్రమ్మ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో స్వా మివారికి పంచామృతాభిషేకం, అలంకరణ చేశారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వ చ్చిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యు లు, భక్తులు పాల్గొన్నారు.
పురందరదాసుల పుణ్యతిథి కార్యక్రమం
కృష్ణ, జనవరి 21 : మండలంలోని గుడెబల్లూర్లో లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం బ్రాహ్మణ స మాజం ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన పురందరదాసుల ఆరాధన మహోత్సవాలు ఘ నంగా నిర్వహించారు. ఆలయలంలో అమావాస్య సందర్భంగా పండితులతో ధార్మిక ఉపన్యాసాలు, పురందర సం కీర్తన మాల కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భ క్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో ఆలయ ప్రధాన అర్చకుడు వెంకోబాచారి, బ్రాహ్మణ స మాజ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

