అమరచింత, జనవరి 22: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నేరాల అదుపునకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నరని అందులో ప్రజల భాగస్వామ్యం ఉంటే పూర్తిగా అరికట్టవచ్చని వనపర్తి డీఎస్పీ ఆనంద్‌రెడ్డి అన్నారు. శనివారం అర్దరాత్రి నుంచి ఆదివారం తెలవారుజామువరకు అమరచింత పట్ట ణంలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత, కొత్త ఎస్సీ కాలనీల్లో డీఎస్సీ ఆనంద్‌రెడ్డి, ఆత్మకూర్ సీఐ రత్నం ఆధ్వర్యంలో అమరచింత, ఆత్మకూర్ ఎస్సైలు శివ నాగేశ్వర్నాయడు, పుట్ట మహేశ్‌గౌడ్‌తో పాటు ముగ్గురు సీఐలు, పది మంది ఎస్సైలు, వంది మంది పోలీసులు ఇల్లి ల్లూ సోదా చేశారు. సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని 42 బైక్‌లు, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం డీఎస్సీ ఆనందరెడ్డి మాట్లాడుతూ ఇటీవల ఈ ప్రాంతంలో అపరచిత వ్యక్తుల సంచారంతో చోరీలు అధికమయ్యాయని వాటి నివారణ కోసం సంవత్సరంలో మూడు సార్లు కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను వెంట పెట్టుకోవాలన్నారు. నేరా లను అదుపు చేసేందుకు ప్రజలు పోలీసులకు సహకరిం చాలని సూచించారు. కార్యక్రమంలో వనపర్తి,కొత్తకోట సీఐ లు, వివిధ మండలాల ఎస్సై లు, పోలీసులు పాల్గొన్నారు.