మరికల్, జూలై 08: మరికల్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వానరానికి బజరంగ్ దళ్ నాయకులు అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం ఉదయం పట్టణంలోని శ్రీవాణి పాఠశాల ఎదురుగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వానరం మృతి చెందింది. విషయం తెలుసుకున్న బజరంగ్దళ్ నాయకులు హిందూ సాంప్రదాయ పద్ధతిలో దానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ నాయకులు మాట్లాడుతూ.. హనుమాన్ వర్గానికి చెందిన వానరం మృతి చెందడంతో గ్రామ యువకుల సహకారంతో హిందూ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా బజరంగ్ దళ్ నాయకులు కుమ్మరి రాజు, బీజేపీ నేతలు కర్లీ నిఖిల్, మంగలి తిరుమలేష్, కూసురు రవి పాల్గొన్నారు.