మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు పురపాలక సంఘం నగర పాలక సంస్థగా మారగానే వసూళ్లపై దృష్టి సారించింది. ఏడాదిగా మున్సిపాలిటీలో అధికారం అనుభవించిన కాంగ్రెస్ పెద్ద లు. దుకాణాల అద్దెలపై మౌనం వహించి వసూలు చే య కుండా కాలం గడిపిపోయారు. స్పెషల్ ఆఫీసర్ పాలన రాగానే అధికార యంత్రాంగం తమ ప్రతాపం చూపి స్తున్న ది. కొందరు సర్కారు పెద్దలు అదే వసూల్ అంశాన్ని తెర మీదకి తెచ్చినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సి పాలి టీ.. కార్పొరేషన్‌గా మారిపోయి సంబురపడిపోతున్న తరు ణంలో అధికార యంత్రాంగం ఏకంగా అద్దె చెల్లించని దు కాణాలను సీజ్ చేసింది.
నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయ డంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గత ప్రభు త్వ హయాంలో దుకాణాల కిరాయిలపై అప్పటి మున్సి పల్ శాఖ మంత్రిని కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. తీరా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బలవంతంగా వసూళ్లకు పాల్పడుతోందని వ్యాపారస్తులు ఆరోపిస్తు న్నారు. బీఆర్ఎస్ నుంచి కొంత మంది కౌన్సిలర్లను బలవంతంగా కాంగ్రెస్‌లో చేర్పించుకొని ఆ తర్వాత మెజారిటీ లేకుండా మున్సిపాలిటీ పగ్గాలను చేపట్టింది. దాదాపు ఏడాదిగా పరిపాలన అనుభవించి.. మున్సిపాలిటీ ఆదాయాన్ని మొత్తం కొల్లగొట్టి ఖజానా ఖాళీ చేసి వెళ్లి పోయారు. అప్పట్లో దుకాణాల అద్దెలపై దృష్టి సారించ కుండా వదిలేశారు. తాజాగా నగర పాలక సంస్థ అధికా రులు సుమారు 50కిపైగా దుకాణా లను సీజ్ చేశారు. ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సర్కిల్లో ము న్సిపల్ దుకా ణాలు మూతపడడంతో బోసిపో తోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాం తంలో దుకాణాలు బంద్ చేయ డం పట్టణంలో చర్చనీయాంశంగా మా రింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఖ జానా నింపుకోవడానికి తమపై బల వంతపు వసూళ్లకు పాల్పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.
రూ.22 కోట్లు బకాయిలు.. 25 శాతం చెల్లిస్తేనే ఓపెన్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా ఆవిర్భవించింది. పట్టణ ప్రజలు సంతోషపడేలోపే అధికారులు బకాయిల పేరా మున్సిపల్ దుకాణాల సముదాయంపై కొరడా ఝుళిపించారు. దాదాపు ఏడా దిగా అటువైపు చూడని అధికారులు స్పెషల్ ఆఫీసర్ పాలన రాగానే దుకాణాల బకాయిలపై దృష్టి సారించింది. జిల్లా కేంద్రంలో మొత్తం నగర పాలక సంస్థకు చెందిన వివిధ సముదాయాల్లో 258 దుకాణాలు అద్దెకు ఇచ్చారు. గత కొన్నేళ్లుగా ఈ దుకాణాలపై సుమారు రూ. 22 కోట్ల బకాయిలు ఉన్నాయి. దీంతో అధికార యంత్రాంగం హుటాహుటిన ఈ వసూళ్లపై పడింది.
ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయిన పాలకులు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు మొత్తం 49 వార్డుల్లో ఏకంగా 40 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. మున్సిపల్ చైర్మన్‌తోపాటు వైస్ చైర్మన్ బీఆర్ఎస్కు చెందిన వారే.. 2023 డిసెంబర్లో అధికారం మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక మున్సిపాలిటీపై కన్నేసింది. పట్టుమని పదిమంది కూడా లేని కౌన్సిలర్లతో బీఆర్ఎస్ కౌన్సిలర్లకు గాలం వేసి ఏకంగా 20 మందిని చేర్చుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి దించేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయిన కౌన్సిలర్‌కు చైర్మన్ పగ్గాలు అప్పగించింది. మరోవైపు అధికార యంత్రాంగం కూడా తోడు కావడంతో ఏడాది కాలంగా మున్సిపల్ బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ.. నయా పైసా కాంగ్రెస్ హయాంలో రానప్పటికీ.. ఆయా వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయాన్ని ఏడాదికాలంగా అనుభవించి వెళ్లి పోయేటప్పుడు చిల్లిగవ్వ లేకుండా చేసి వెళ్లిపోయారు. దీంతో మున్సిపాలిటీ గడువు ముగి యడంతో స్పెషల్ ఆఫీసర్ పాలన మొదలైంది. మహబూ బ్‌నగర్ జాయింట్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో అధికారులు ఆదాయ మార్గాల వైపు చూస్తున్నారు.
మున్సిపల్ దుకాణాల అద్దె రాజకీయం
మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థగా మారటం.. స్పెషల్ ఆఫీసర్ పాలన రావడం.. పట్టణ ప్రజలు సంతోషపడేలోపే నగరపాలక సంస్థల కాంప్లెక్స్‌లపై దాడులు నిర్వహించారు. దుకాణాలు నడుస్తుండగానే షెట్టర్లు కిందికి వేసి మూసి వేశారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో నగరపాలక సంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ లు ఉన్నాయి. ఈ కాంప్లెక్స్‌ల్లో ఉన్న దుకాణాలన్నీ ఎప్పు డూ కిటకిటలాడుతుంటాయి. అయితే జిల్లా కేంద్రానికి చెందిన కొంతమంది నేతల అండదండలతో షాపు యజ మానులతో కుమ్మక్కై అద్దెలను ఎగ్గొడుతూ వచ్చారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ దుకా ణాల అన్నింటికీ టెండర్ నిర్వహించి భారీగా ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టింది.
కొందరు అత్యాశకుపోయి ఎక్కువ ధరకు పాడి దుకాణాలు దక్కించుకున్నారు. ఇటీ వల క్లాక్ టవర్ సర్కిల్లో షాపింగ్ మాల్స్ రావడం.. నగర పాలక సంస్థ దుకాణాల్లో గిరాకీ బాగా తగ్గిపోయింది. దీంతో కొంతమంది అద్దెలు కట్టలేని స్థితిలో ఉన్నారు. ఇది గ్రహించిన గత పాలకులు ము న్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లి పరిస్థితిని వివరించారు. అయితే పాత కిరాయికి మూడు రెట్లు ఎక్కువ కట్టి చె ల్లించండి అంటూ.. ఆ తర్వాత మార్గం ఆలోచిద్దాం.. అంటూ పరి ష్కారం చెప్పారు. దీంతో హర్షం వ్యక్తం చేసిన వ్యాపారులు ఆ లెక్కన కడుతూ వచ్చారు. కొంతమంది నేతలు బినామీల పేర్లపై దుకాణాలు దక్కించుకొని వ్యాపారస్తులతో వసూలు చేసి నగరపాలక సంస్థకు కట్టడం లేదు. ఈ బకాయిలన్నీ పేరుకుపోయాయి. వీటన్నింటికీ స్పెషల్ డ్రైవ్ నిర్వ హించారు. కాగా అద్దె వసూళ్లలో నిర్లక్ష్యం వహించారంటూ ఆరుగురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
టేస్టీ టేస్టీ చికెన్ డిన్నర్..
మున్సిపాలిటీ పగ్గాలు ఇలా చేతికి దక్కావో లేదో.. అలా కొంతమంది ప్రముఖులకు నెలనెలా చికెన్ డిన్నర్ లభిస్తుందనే చర్చ నడుస్తోంది. జిల్లా కేంద్రంలోని చికెన్ వ్యర్థాలను తరలించేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత బినామీ కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఇదే వ్యర్థాల తరలింపునకు టెండర్లు కూడా ప్రకటించారు. మళ్లీ ఏమైందో ఏమో కానీ టెండర్ రద్దయి అతనికే తిరిగి అప్పగించారు. దీంతో మున్సిపాలిటీలోని ఒకరిద్దరూ నాయకులతో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ప్రతినెల చికెన్ డిన్నర్ రూపంలో వెళుతుండడం చర్చనీయాంశంగా మారింది. సడన్‌గా స్పెషల్ ఆఫీసర్ల పాలన రావడంతో చికెన్ డిన్నర్ ఒకరిద్దరికే పరిమితమైందని మాజీ నాయకులు బాధపడుతున్నారట.. ఇప్పుడు అంతా ఆఫీసర్ల చేతుల్లోకి వెళ్లడంతో.. ఒక ఆఫీసర్ నాకు చికెన్ డిన్నర్ కావాలని పట్టుబడుతున్నాడట.. నగర పాలక సంస్థలో ఇప్పడు ఈ చికెన్ డిన్నర్ హాట్ హాట్ టాపిక్‌గా మారింది.