బల్మూర్ : మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం బల్మూర్ పోలీసులు కార్డన్ సెర్చ్ (Cordon search) నిర్వహించారు. సరియైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు ( DSP Srinivasulu ) మాట్లాడుతూ అసాంఘికశక్తులతో ప్రమాదం జరుగకుండా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
గుర్తు తెలియని వ్యక్తులు అనుమానస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. చట్టాన్ని ఎవరు కూడా చేతిలోకి తీసుకోవద్దని పేర్కొన్నారు. దొంగతనాలకు అరికట్టేందుకు, గ్రామాల్లోని యువకులు గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట, అమ్రాబాద్ సీఐలు రవీందర్, శంకర్, స్థానిక ఎస్సై రమాదేవి, వివిధ మండలాల ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.