రాజోళి, నవంబర్ 3 : ప్రజల ప్రాణాలను కబలించే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి రాజోళి మండలంలో పెద్ద ధన్వాడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కాపాడాలని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆ యన ఫ్యాక్టరీ నిర్మాణ స్థలాన్ని స్థానిక నాయకులు, గ్రామస్తులతో కలిసి పరిశిలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగభద్ర నదీతీర ప్రాంతాల్లో పచ్చని పంటలు పండిస్తూ సంతోషంగా జీవిస్తున్న కుటుంబాల్లో ఫ్యాక్టరీతో అంధకారం అలుముకుంటుందన్నారు.
ప్రజలకు అండగా ఉంటూ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఫ్యాక్టరీ వ్యర్థాల వల్ల గాలి, నీరు కలుషితమవుతాయని, పంటలు పండక రైతులు వలసలు వెళ్లాల్సిన దుస్థి తి నెలకొంటుందన్నారు. బీఆర్ఎస్ తరఫున ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటామన్నారు. ఈ విషయాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో నారాయణ, లక్ష్మణ్, రాజు, తిరుపతయ్యతోపాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.