నాగర్‌కర్నూల్, (నమస్తే తెలంగాణ)/గద్వాల, మార్చి 1 : పేదలపై కేంద్ర ప్ర భుత్వం మరోసారి గుది‘బండ’ మో పింది. గ్యాస్ సిలిండర్ ధరలను మరోసా రి పెంచుతూ పెట్రోలియం సంస్థలు ని ర్ణయం తీసుకున్నాయి. వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. 50, వాణిజ్య సిలిండర్ పై రూ.350.50 వరకు ఆర్థిక భారం పెంచింది. గతేడాది జూలైలో నాలుగుసా ర్లు వంటగ్యాస్ ధరలు పెంచడంతో వినియోగదారులు ఆందోళన చెందారు. ప్ర స్తుతం మళ్లీ రూ.50 పెంచడంతో.. సిలిండర్ల ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియక ప్రజలు తికమక పడుతున్నారు. ఇప్పుడు ఉన్న ధర వచ్చే నెల ఉండడంలేదు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యుడు ఏమీ కొన, తినలేని పరిస్థితిలో ఉండగా.. పెరిగిన గ్యాస్ ధరతో ఆర్థికభారం మోయలేకపోతున్నాడు. కట్టెల పొ య్యి ద్వారా ప్రజలు అనారోగ్యాలబారిన పడుతున్నారని భావించిన కేంద్రం సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేసింది.
మొదట సబ్సిడీని అందజేస్తూ వచ్చి.. ఇప్పుడు కేంద్రం పూర్తిగా కట్ చేసింది. ఇష్టం వచ్చినప్పుడల్లా సి లిండర్ ధరలను పెంచుతూ సామాన్యులకు గుదిబండగా మారింది. ఇకముందు ఇంకెంత ధర పెంచుతారోనని ఆందోళన చెందుతున్నారు. ఇ ప్పటివరకు గృహ సిలిండర్ ధర రూ.1,123.5 ఉండగా.. పెరిగిన ధరలతో రూ.1,173కు చేరుకోనున్నది. ఇక వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,007.5 ఉండగా.. రూ.350 చొప్పున పెరిగి రూ.2,359కు చేరుకున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా లో 2,34,453 గృహోపయోగ సిలిండర్ కనెక్షన్లు ఉండగా, 2 వేలకుపైగా వాణిజ్య సిలిండర్లు ఉన్నాయి. ఇందులో దీపం పథకం కింద 61 వేలు, ఉజ్వల పథకం కింద 36 వేలు ఉన్నాయి. పెరిగిన ధరలతో వంట గ్యాస్ సిలిండర్లు వాడుతున్న పేదలపై రూ.1.17 కోట్లు, వాణిజ్య సిలిండర్ వినియోగదారులపై రూ.7లక్షల అదనపు భారం పడనున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా లో 1.75 లక్షల సిలిండర్లు ఉన్నాయి. ఇందులో దీపం పథకం కింద 39,679, పీఎంయూవై కిం ద 21,726, సీఎస్ఆర్ కింద 3, 258, ఎ స్సీ, ఎస్టీలకు 10,475, బీపీఎల్ కింద 21,726, సింగిల్ సిలిండర్లు 76,816, కమర్షియల్ కింద 744, ఇతర సిలిండర్లు 1,052 ఉన్నాయి. ఇప్పుడు పె రిగిన ధరలతో జిల్లా ప్రజలపై ప్రతి నెలా సుమారు రూ.కోటి అదనపు భారం ప డనున్నది. ఇప్పటికైనా కేంద్రం ధర లు తగ్గించాలని ప్రజలు డిమాం డ్ చేస్తున్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 3 న బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రజలు పెద్ద ఎ త్తున రావాలని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు.
ధరలను నియంత్రించాలి..
గ్యాస్ ధరలు పెంచడం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతు న్నారు. నిత్యావసర సరకుల ధరలు పెరిగి ఏమీ కొనలేని పరిస్థితి లో ఉండి ఉన్న కాడికి సర్ధుకుంటున్నాం. ఇప్పుడు గ్యాస్ సి లిండర్ ధరలను పెంచడంతో కడుపులో మంటలేపుతున్నా యి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు తగ్గించి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీ సుకోవాలి.
– భాగ్య, గృహిణి, అయిజ
ధరల నియంత్రణలో కేంద్రం విఫలం..
గతంలో కట్టెల పొయ్యిపై వంట చేసుకునేవాళ్లం. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత సిలిండర్లు అందజేసి అందరికీ అలవాటు చేసింది. ఇప్పుడు ధరలు పెంచుతూ పోతున్నది. ధరలు ఇలా పెరుగుతూపోతే గ్రామీణ ప్రజలు తిరిగి కట్టెల పొయ్యి వైపు చూడక తప్పడం లేదు. ధరల నియంత్రణలో కేంద్రం విఫలమైంది. సామాన్యులను దృష్టిలో ఉంచుకొని ధరలు తగ్గించాలి.
– శాంతమ్మ, గృహిణి, జమ్మిచేడు