కల్వకుర్తి, సెప్టెంబర్ 15 : తమకు ఇస్తు న్న వేతనాలు సరిపోవడం లేదని, వేతనాలను పెంచడంతో పాటు, పర్మినెంట్ చే యాలనే డిమాండ్లతో గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వంట కార్మికులుగత ఐదు రోజులుగా సమ్మె బా ట పట్టారు. వంట వారు తమ వేతనాల కోసం వంటపని మానేసి నిరసన వ్యక్తం చే స్తుండగా.. విద్యార్థుల కడుపు నింపేందుకు పాఠశాలలో పనిచేసున్న ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు వంట మనుషుల అవతారం ఎత్తాల్సిన పరిస్థితులు వచ్చాయి.
గత శుక్రవారం నుంచి వంటవారు సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వి ద్యార్థుల గురించి ఆలోచించకుండా ప్ర భు త్వం ఎందుకు నిర్లక్షంగా వ్యవహరిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఆకలితో అలమటించకుండా ఆయా ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది వంటవాళ్లుగా అవతారమెత్తి కడుపులు నింపుతున్నారు.
గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో..
కల్వకుర్తి గిరిజన గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకు దాదాపు 360 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలలో వంట చేసేందుకు 12 మంది వంట వారు తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్నారు. వేతనాలు సరిపోవడం లేదని ఈ మధ్యనే ఐదుమంది వంట వారు మానేశారు. మిగిలిన ఏడుగురు మాత్రమే వంట పనులు చేస్తున్నారు. ఐదు రోజుల నుంచి వారు కూడా వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె లో వారు భాగస్వాములయ్యారు.
ప్రత్యామ్నాయ దారులు వెతకని ఉన్నతాధికారులు చేతులెత్తేశారు. పిల్లల ఆకలి బాధ్యత సదరు పాఠశాలల్లో పనిచేసే ప్రిన్సిపాల్, బోధన, బోధనేతర సిబ్బందిపై పడిం ది. కల్వకుర్తి గురుకుల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం చూ స్తే.. ఉపాధ్యాయులు విద్యార్థులకు భోజనాన్ని వడ్డిస్తున్నారు. భోజనాల అనంతరం ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ డైనింగ్ హాల్‌ను శుభ్రం చేస్తున్నాడు. విద్యార్థుల భధ్రతను చూసే కామాటి తిరుపతయ్య రాత్రి విద్యార్థులు తినేందుకు భోజనాన్ని సిద్ధం చేస్తున్నాడు. పీఈటీతో పాటు మరో బోధనేతర సిబ్బం ది, 9వ తరగతికి చెందిన ఫుడ్ కమిటీ లీడర్లు కూరగాయలు కోస్తున్నారు. బ య ట నుంచి వంట మనుషులను తీసుకువచ్చే ప్రొవిజన్ లేదు. పిల్లలను పస్తులుంచ లేం. అందుకే పిల్లలతో కలిసి మేమే వంట చేస్తున్నామని ప్రిన్సిపాల్ చెప్పారు.
కాంగ్రెస్ జీతం తగ్గించింది..
గత ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వడం లే దు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.13 వేల జీతం ఇచ్చారు. రేవంత్ సర్కార్ వచ్చాక రూ.11వేలకు జీతాన్ని కుదించారు. ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఇక్కడ మాత్రం తెల్లవారు 5 గంటల నుంచి రాత్రి వరకు పనిచేయాలి. పనికి తగ్గ జీతం ఇవ్వాలి. మా ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలి.
– నీల, వంట కార్మికురాలు, కల్వకుర్తి
15 ఏండ్లుగా పనిచేస్తున్నా..
15 ఏండ్లుగా కల్వకుర్తి గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో వం ట మనిషిగా పనిచేస్తున్నాను. తెల్లవారు జా మునుంచి రాత్రి వరకు పిల్లలను కనిపెట్టుకుని ఉంటాం. ఇంత చేస్తే మాకు ఇచ్చే జీతం రూ.11వేలు మాత్రమే. ఈ జీతా లు సరిపోవడం లేదు. ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకుంటే గడ్డి తిని బతకాలా. మాకు పనికి తగిన వేతనం ఇవ్వాలి.
– బాలకిష్టమ్మ, వంట కార్మికురాలు