నాగర్ కర్నూల్ : నాగర్కర్నూల్ ( Nagarkurnul ) జిల్లా కలెక్టర్ ( Collector ) హామీ మేరకు కాంట్రాక్టు కార్మికులు సమ్మెను విరమించారు( Strike Called off ) . నెలరోజుల్లో పెండింగ్ వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆదివారం నుంచి సమ్మెను విరమించినట్లు సీఐటీయూ నాయకులు శ్రీనివాసులు తెలిపారు. గత నాలుగురోజుల నుంచి కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమకు ఆరు నెలలుగా వేతనాలు వెంటనే చెల్లించడం లేదని ఆరోపిస్తూ నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు.
విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కార్మికులను పిలిచి వారితో మాట్లాడి స్పష్టమైన హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మె విరమించారని తెలిపారు. పనిచేస్తేనే పూట గడిచే పరిస్థితిలో ఉన్న కార్మికులకు అధికారుల సతాయింపు సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజ్వాన్, నాగమణి, ఎల్లమ్మ, శ్రీదేవి, అలివేల రేణుక, నాగయ్య, వెంకటేష్, వాసన కర్రెన్న, తదితరులు పాల్గొన్నారు.