గద్వాల, జనవరి 19 : ఇండ్లు లేని పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చి పేదోడి సొంతింటి కల నెరవేర్చాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణం గా ఇండ్ల నిర్మాణాలు పూర్తయినా పేదవాడి సొం తింటి కల మాత్రం నెర వేరడం లేదు. 2023 ఏప్రి ల్లో ఇండ్లు లేని పేదలు డబుల్ బెడ్రూం ఇండ్ల్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని అప్పటి కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. అయితే గూడు లే ని పేదలు సొంతింటి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నిజంగా ఇండ్లు ఉందా లేదా అనే విషయాన్ని వార్డుల వారీగా అధికారులను నియమించి పూర్తి స్థాయి విచారణ చేసి లబ్ధిదారులను ఎంపిక చేసిన నేటి వరకు లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు జరగకపోవడంతో వారు సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారు.
వివరాలలోకి వెళితే..
గద్వాల పట్టణ సమీపంలోని పరుమాల శివారులో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 41ఎకరాల్లో 1,275 డబుల్ బెడ్రూం ఇండ్ల్ల నిర్మాణం చేపట్టింది. ఇండ్ల్ల నిర్మాణం జీప్లస్ గా నిర్మించారు. ఒక్కో బ్లాక్లో 24ఇండ్లు నిర్మించా రు.1,275 డబుల్ ఇండ్లకు అధికారులు దరఖాస్తులు 20 23 ఏప్రిల్ ఆహ్వానించారు. 1,275 ఇండ్లకు 5,155మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పూర్తిస్థాయిలో విచారణ చేయగా అందులో 3,171మంది లబ్ధిదారులు అర్హులుగా గుర్తించారు. అయితే ఇందులో గతంలో ప ట్టాలు పొందిన వారు ఉండగా వారు కోర్టుకు వెళ్లా రు. కోర్టుకు వెళ్లిన 504మంది లబ్ధిదారులకు సం బంధించి ఇండ్లను డిప్లో వేయకుండా 771ఇండ్లకు డిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే ఎంపిక చేసిన సమయంలో డిప్లో ఇల్లు పొందిన వా రికి ప్రొసీడింగ్ ఇవ్వలేదు. దీంతో డిప్లో ఇండ్లు పొందిన వారు తమ సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారు.
ఇండ్లకు డిప్ వేసిన సమయంలో ఇండ్లకు కొన్ని మౌలిక వసతులు కల్పించే విషయంలో వారికి కేటాయించలేదు. అవి కల్పించిన తర్వాత అందరిని ఒకే సారి గృహ ప్రవేశం చేయిస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో డిప్లో డబుల్బెడ్రూం ఇల్లు పొందిన వారి సొంతింటి కలపై ఎన్నికల కోడ్ నీళ్ల్లు చల్లినట్లు అయింది. ఎన్నికలు జరిగి ఏడాది దాటినా ఇప్పటి వరకు డబుల్ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులకు కేటాయింపులో జాప్యం జరుగుతుండడంతో లబ్ధిదారులు భయాందోళనకు గురవుతున్నారు. తమకు డిప్లో కేటాయించిన ప్రస్తుతం గద్వాలలో మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం కారణంగా ఇళ్లు వస్తుందో రాదో ఆనే ఆందోళనలో లబ్ధిదారులు ఉన్నారు.
డిప్ తీసీ ఈ ఏప్రిల్ నెల వస్తే రెండేళ్లు అవుతున్నా లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండంతో వారి తీరుపై ఇండ్లు లేని నిరుపేదలు గుర్రుగా ఉన్నారు. త్వరగా డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి మౌలిక వసతులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించడం, స్వయంగా డబుల్ బెడ్రూం ఇండ్లు పరిశీలన చేసి పనులు వేగవంతంగా చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించినా ఆ దిశగా పనులు సాగడం లేదు. ఎమ్మెల్యే అయినా కలుగజేసుకొని పనులు పూర్తయ్యేలా చ ర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. వెంటనే మిగిలిపోయిన పనులు పూర్తి చేసే విధంగా కలెక్టర్,ఎమ్మెల్యే చొరవ చూపి లబ్ధిదారులకు ఇండ్లు అందజేయాలని ఇండ్ల్లు లేని నిరుపేదలు కోరతున్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల్లకు రక్షణ కరువు
డబుల్ బెడ్రూం ఇండ్ల్ల నిర్మాణం పూర్తై రెండేండ్లు కావస్తున్నా అవి లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో వాటికి రక్షణ లేకుండా పోయింది. లబ్ధిదారులుకు కేటాయించకపోవడంతో వాటికి ఏర్పాటు చే సిన గ్లాస్ కిటికీ అద్దాలు పగిలిపోతున్నాయి. పర్యవేక్షణ లేకపోవడం అందులో పశుపక్ష్యాదులు సేద తీరడంతో పా టు మందుబాబులకు అడ్డాగా మారినట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. అవి లబ్ధిదారులకు కేటాయించే వరకు వాటికి అధికారులు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.