అచ్చంపేట, జూన్ 27 : బీఆర్ఎస్ హయాంలో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 150 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించి లక్కీ డ్రా నిర్వహించి పారదర్శకంగా ఇండ్ల కే టాయింపు చేశారు. అయితే పట్టణంలో నివాసముంటున్న సుజాత భర్త కురుమూర్తి 20 19లో మృతిచెందాడు. అద్దె ఇంట్లో ఉం టూ కుట్టుమిషన్ కుడుతూ ఇద్దరు పిల్లలను పోషించేది. ఈమెకు లక్కీడ్రా (నెంబర్ ఎ/ 776/ 2023)లో రాజీవ్‌నగర్ కాలనీ సర్వేనెంబర్ 213 (బ్లాక్ నెంబర్ హెచ్-56)లో డబుల్ బెడ్రూం వచ్చింది.
అధికారులు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి ఇల్లు కూడా కేటాయించారు. త ర్వాత సొంత డబ్బులు పెట్టి చిన్నచిన్న మరమ్మతులు చేయించుకున్నది. కొన్ని నెలలకు ఆమె కుమారుడు మృతి చెందడంతో కొద్దిరోజులు తాత్కాలికంగా తల్లిగారింటికి వె ళ్లింది. తిరిగి వచ్చి చూడగా, అ చ్చంపేట ఆర్డీవో మాధవి ఇంట్లో పనిమనిషి జగదాంబకు ఇదే ఇల్లు కే టాయించినట్లు తెలుసుకున్నది. న్యాయం గా లక్కీడ్రాలో వచ్చిన ఇంటిని తనకు తెలియకుండా ఆర్డీవో ఇంట్లో పనిచేస్తున్న మహిళకు ఇవ్వ డం ఏమిటని ప్రశ్నించింది.
బాధితురాలు ఆర్డీవో మా ధవిని ఈ విషయమై ప్రశ్నించగా.. దుర్భాషలాడడంతో పాటు తాను చూపించిన డబుల్ బెడ్రూం ఇంటి ప్రొసీడింగ్ కాపీని విసిరికొట్టిందని సుజాత ఆరోపించింది. అంతేకాకుండా తాను ప్రైవేట్ పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నందుకే డబుల్ ఇంటికి అనర్హురాలివంటూ ఆర్డీవో చె బుతున్నదని వాపోయిం ది. ఈనెల 23న ప్రజావాణి లో కలెక్టర్‌కు సుజాత ఫిర్యాదు చేయగా.. అధికారులు వచ్చి విచారణ చేసి వెళ్లారని ఆమె తెలిపింది. పేదల పొట్టకొడుతున్న ఆర్డీవోపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని బాధితురాలు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆర్డీవోను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా, అందుబాటులోకి రాలేదు.