గద్వాల, ఆగస్టు 16 : గుర్రంగడ్డ.. ఈ గ్రామం పేరు చాలా మందికి తెలీదు.. కేవలం చలికాలం, వేసవి కాలంలోనే ఈ గ్రామవాసులు కనిపిస్తుంటారు.. వర్షాకాలంలో పల్లెకు బాహ్యప్రపంచంతో సం
బంధాలు నిలిచిపోతాయి. కారణం కృష్ణానదికి వచ్చే వరద.. నది మధ్యలో దివి గ్రామం కావడంతో ఇక్కడి వారు నది దాటాలంటే పుట్టి ప్రయాణం చేయాల్సిందే.. వరద తగ్గిన
తరువాత రైతులు పంట ఉత్పత్తులను రంగాపురం వైపు ట్రాక్టర్లలో తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. చదువుకోవాలన్నా.. వైద్యం కోసం వెళ్లాలన్నా.. చుట్టాలింటికి వెళ్లాలన్నా.. వారి బాధ
లు వర్ణణాతీతం.. పొద్దుగూకేలోపే గ్రామానికి చేరుకోవాలి. చీకటి పడితే పుట్టీ వెళ్లదు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు గత పాలకులకు ఎన్నోసార్లు మొరపెట్టుకు
న్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ బ్రిడ్జి నిర్మిస్తామని ఓట్లు దండుకున్నారే గానీ వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ బ్రిడ్జి నిర్మా
ణానికి హామీ ఇచ్చారు. ఆ మాట మేరకు రూ.9.47 కోట్లు మంజూరు చేయించగా.. ప్రస్తుతం పిల్లర్ల పనులు సాగుతున్నాయి. పనులు పూర్తయితే గ్రామానికి మార్గం సుగమం కాను
న్నది. త్వరలో దశాబ్దాల కల తీరనుండగా.. గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
గత పాలకులు గుర్రంగడ్డ గ్రామస్తులను ఊరిస్తూ వచ్చారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వంతెన నిర్మించి గ్రామస్తుల కష్టాలు తీర్చుతామని చెబుతూ వచ్చారే తప్పా గెలిచాక బ్రిడ్జి ఊసే ఎత్తకపోవడంతో వారు నానా అవస్థలు పడేవారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు నాలుగు నెలలపాటు వారికి మానవ సంబంధాలు కనుమరుగయ్యేవి. ఎవరికైనా ఆపద వస్తే అంతే సంగతులు. రాత్రి అయితే చాలు పుట్టి కూడా వెళ్లదు. గ్రామానికి చేరుకోవాలంటే సాయంత్రం ఐదుగంటల లోగా నది సమీపానికి వెళ్తే గ్రామానికి తీసుకెళ్తారు. తిరిగి ఉదయం పుట్టి వస్తేనే గద్వాలతోపాటు ఇతర గ్రామాలకు వెళ్లే పరిస్థితి. ఎన్నో దశాబ్దాలుగా కృష్ణానది మధ్యలో ఉంటూ నరక ప్రాయంగా బతికిన గుర్రంగడ్డ ప్రజల కష్టాలను తెలుసుకున్న ప్రభుత్వం పుట్టికి బదులు మరబోటును ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం కల్పించింది. వరద తగ్గిన సమయంలో వారు పండించిన పంట ఉత్పత్తులు రంగాపురం వైపు ట్రాక్టర్లతో తీసుకొచ్చి విక్రయించుకునే వారు.
వీరి ఇబ్బందులను గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల సమయంలో బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇవ్వడం, జీవో విడుదల చేయడం వెనువెంటనే జరిగిపోయాయి. రూ.9. 47కోట్లతో టెండర్లు పిలిచి శంకుస్థాపన కూడా చేశారు. పనులు ప్రారంభమై పిల్లర్ల నిర్మాణం కూడా సగం వరకు వచ్చింది. ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. దీంతో కాంట్రాక్టర్ తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మా కోసం బ్రిడ్జికి నిధులు మంజూరు చేస్తే అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు ఆగిపోవడంపై మండిపడుతున్నారు. కాంట్రాక్టర్ ఏడాది లోపు బ్రిడ్జి పనులు పూర్తి చేయాల్సినా.. ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. కాంట్రాక్టర్‌పై అధికారులు చర్యలు తీసుకొని బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు.
గ్రామ వివరాలిలా..
గుర్రంగడ్డ కృష్ణానది మధ్యలో ఉన్న గ్రామం. ఈ ఊరి చుట్టూ నీరు చేరి ఉండడంతో దీనిని దివి గ్రామంగా పిలుస్తారు. గ్రామంలో మొత్తం 194 ఇండ్లు ఉండగా అందులో 950 మంది నివసిస్తున్నారు. గ్రామ మొత్తం 2,400 ఎకరాలు విస్తీర్ణంలో ఉండగా సాగుభూమి 1,150 ఎకరాలు ఉన్నది. 1,100 ఎకరాల్లో రెండుపంటలు సాగు చేస్తుండగా మరో 50 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తారు. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. వానకాలం ప్రారంభం కాకముందే రంగాపురం వైపు వేసుకున్న మట్టి రోడ్డు మీదుగా రైతులు తమకు అవసరమైన ఎరువులు, విత్తనాలతోపాటు ఇతర సామగ్రిని ముందే తెచ్చుకుంటారు. గ్రామం నుంచి బయటకు రావాలంటే కృష్ణానదిని దాటాల్సిందే. గుర్రంగడ్డ నుంచి పుట్టి లేదా మరబోటులో నదిని దాటి బీరోలు గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి గద్వాలకు వెళ్లి పనులు పూర్తి చేసుకొని వెళ్తారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించడంతోపాటు పనులు జరుగుతుండడతో త్వరలో గ్రామస్తుల కష్టాలు తీరనున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో వంతెన నిర్మాణానికి కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.