కల్వకుర్తి, డిసెంబర్ 22 : ఓటమిని జీర్ణించుకోలేక.. ఓడిపోయామనే ఆక్రోశంతో బెదిరింపులకు పాల్పడమే కాకుండా ఇండ్ల మీదకు వచ్చి దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ సోమవారం కల్వకుర్తి మండలం ఎంగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుదారుల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ మద్దతుదారులు నిర్వహించిన ధర్నాలో గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొని న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దాడులకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
ఎంగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మద్దతు పలికిన అభ్యర్థి యాదగిరిరెడ్డి సర్పంచ్‌గా గెలుపొందాడు. ఎన్నికల ఫలితాల రోజు నుంచి కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓటమికి గురైన కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు గ్రామస్తులు కొందరిని టార్గెట్ చేసుకుని బెదిరింపులకు గురిచేస్తున్నారు. మీ అంతు చూస్తాం.. ప్రభుత్వం మా దే.. ఊర్లో ఎలా ఉంటారో.. ఎలా మనుగడ సాగిస్తారో అంటూ అడుగడుగునా బెదిరింపులకు గురిచేయసాగారు. ఇది ఇలా సాగుతుండగా ఆదివారం సాయంత్రం బీఆర్ఎస్ శ్రేణు లు గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఇండ్లకు వెళ్లిపోయా రు.
రాత్రి వేళల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలు, మద్దతుదారుల ఇండ్ల మీదకు వెళ్లి దాడులకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం కల్వకుర్తి కూరగాయల మార్కెట్లో కమీషన్ వ్యాపారం చేస్తు న్న సర్పంచ్ బంధువుపై ముగ్గురు కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడ్డారు. దీంతో భ యాందోళనలకు గురైన బీఆర్ఎస్ మద్దతుదారులు సోమవారం కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఆధారాలను చూపుతూ ఫిర్యాదు చేశారు. అ నంతరం గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో కలిసి న్యాయం చేయాలని, కాంగ్రెస్ నాయకులనుంచి రక్షణ కల్పించాలని కోరుకుంటూ ధ ర్నాకు దిగారు.
దాడులకు దెగబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధ ర్నా విషయం తెలుసుకున్న పోలీసులు ఎంగంపల్లి గ్రామానికి చేరుకున్నారు. ధర్నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులను మహిళలు నిలదీశారు. తమపై దాడులు చేస్తుంటే.. దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అధికారం ఉందని అధికా ర పార్టీ నాయకుడు చెలరేగిపోతున్నారని గ్రా మస్తులు మండిపడ్డారు. తమపై దాడులు చే స్తుంటే.. దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంపైన విశ్వాసం లేకనే బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారని.. ఇది ముమ్మాటికి పిరికిపందల చర్య అని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఎంగంపల్లిలో బీఆర్ఎస్ మద్దతుదారుల చేపట్టిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఓటు వేయలేదనే నేపంతో గ్రామస్తులపై, బీఆర్ఎస్ మద్దతుదారులపై దాడులకు పాల్పడమేమిటని ఆయన ప్రశ్నించారు. దాడులకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
అధికార మదంతో వెర్రివేషాలు వేస్తు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తారా అంటూ మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. బీఆర్ఎస్ శ్రేణులకు అన్ని వేళల్లో అండగా ఉంటామని, అధికార కాంగ్రెస్ దాడులను తిప్పికొడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.