నాగర్కర్నూల్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : కృష్ణానది జలాల్లో హక్కులు కోల్పోయే పరిస్థితులను కాంగ్రెస్ తీసుకొస్తున్నది. కేఆర్ఎంబీకి కృష్ణా నది ఆధారిత ప్రాజెక్టులను అప్పగించేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆ ధ్వర్యంలోని ప్రభుత్వం సిద్ధమవ్వడంతో రాబోయే రో జుల్లో పాలమూరులోని పల్లెల్లో కరువు నెలకొననున్నది. కేంద్రం ఆధీనంలోకి శ్రీశైలం రిజర్వాయర్తోపాటుగా జలవిద్యుత్ కేంద్రం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత ల, ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టులు చేరనున్నాయి. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం హక్కులను కేంద్రానికి తనఖా పె ట్టడంతో సమైక్య పాలనలోని చేదు ఫలితాలు రాబో యే కాలంలో ఎదురవుతాయన్న ఆందోళన తెలంగాణ వాదుల్లో నెలకొన్నది.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానదిపై ని ర్మించిన తెలంగాణ ప్రాజెక్టుల హక్కులను కేంద్ర ప్రభుత్వానికి దాఖలు చేయనున్నది. దీంతో రాబోయే రోజుల్లో పాలమూరులో కృష్ణానది ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులపై సర్వ హక్కులను కోల్పోయే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. సమైక్య పాలనలో వాటిల్లిన నీళ్ల పంపిణీలో జరిగిన అన్యాయాలను కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో దాదాపుగా పూర్తి చేసింది. ఇందులో భాగంగా కృష్ణానదిపై నిర్మించి దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నా గర్కర్నూల్ జిల్లాలోని ఎంజీకేఎల్ఐని ఏడాదిన్నరలోనే పూర్తి చేసి 2016 నుంచి సాగునీళ్లు అందించింది. దీం తో బీళ్లుగా ఉన్న జిల్లాలోని నాగర్కర్నూల్, కొల్లాపూర్తోపాటు కల్వకుర్తి చివరి ఆయకట్టుకు, అచ్చంపేట, జ డ్చర్ల, వనపర్తిలోని పలు మండలాలకు సాగునీళ్లు అంది పచ్చని మాగాణుల్లా మారాయి. దీనివల్ల నాగర్కర్నూల్ జిల్లాలో ఏడాదిలో దాదాపుగా 4లక్షల ఎకరాల విస్తీర్ణం లో సాగవుతున్న పంటలు దాదాపుగా 9లక్షల ఎకరాల కు చేరడం గమనార్హం. దీనికి తోడుగా దక్షిణ తెలంగాణ వరప్రదాయినిగా నిలిచే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ రాష్ట్ర నిధులతోనే పూర్తి చేశారు.
ఇందులో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ను గతం లో సీఎం హోదాలో కేసీఆర్ ప్రారంభించగా వట్టెం, ఏ దుల రిజర్వాయర్లు దాదాపుగా పూర్తయ్యాయి. కృష్ణా నదికి నీళ్లు రాక, ఎన్నికలు రావడంతో ఈ రిజర్వాయర్లు ప్రారంభానికి నోచుకోలేదు. ఇక భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్లో పెండింగ్ పనులనూ గత పదేండ్లలో పూర్తి చేసింది. ఇలా ఏడాదిలో రెండు పంటలు పండు తూ, చెరువులు, కుంటల్లో నీళ్లతో మత్స్య సంపద వృద్ధి చెందింది. పశువులకు గ్రాసం కొరత కూడా తీరింది. నాటి గంజి కేంద్రాలు కనుమరుగయ్యాయి. గత ప దేండ్లలో ప్రజల జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయమూ పెరిగింది. ఇవన్నీ పాలమూరు ప్రజల కండ్ల ముందు సాక్షాత్కరిస్తూనే ఉంటే సీఎం రేవంత్ పాలమూరులో ఒక్క ప్రాజెక్టు కూడా కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేయలేదని, ప్రారంభించలేదని చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ క్రమం లో కృష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చేందుకు గ తంలో కేసీఆర్, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసినా స్పందించ లేదు. దీనిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు సైతం నిర్వహించింది. ఇదిలా ఉంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానది ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధమవ్వడం పాలమూరు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది.
దీనివల్ల తెలంగాణ ప్రభుత్వ హక్కులు కేంద్రానికి దాఖలవుతాయి. కృష్ణానదిలో గ్లాసు నీళ్లు కావాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడనున్నది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏపీలోని జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది. ఫలితంగా కృష్ణా నీళ్లను ఆంధ్రాకు గతంలో మాదిరిగా ఆర్డీఎస్ను పగులగొట్టి, దొంగతనంగా కాకుండా దర్జాగా తరలించుకెళ్లే పరిస్థితులు రా నున్నాయి. ఇదే జరిగితే శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తిపై, మిషన్ భగీరథ ద్వారా నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లోని 19 మున్సిపాలిటీ లు, 88 మండలాలు, 4,427 గ్రామాలకు తాగునీరు కావాలన్నా కేంద్ర ప్రభుత్వాన్ని దేహీ అనాల్సిన దుస్థితి రానున్నది. ఇలా కృష్ణా జలాల్లో వాటా హ క్కులు అడగడం మరిచిపోయి తాగునీటికీ తండ్లాడే పరిస్థితులు ఎదురవుతాయన్న ఆందోళన తెలంగాణవాదులు వ్యక్తం చేస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలు ఆచరణలో విఫలమవుతూ ప్రజల విమర్శలకు గురవుతున్న నేపథ్యం లో కృష్ణానదిలో నీటి వాటా తేల్చని, పాలమూరు పథకానికి జాతీయ హోదా ఇవ్వని కేంద్రంతో రేవంత్ జతకట్టడం మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నది.