పెబ్బేరు, మే 10: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు అడుగడుగునా రైతులను అరిగోసకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ కన్నెర్ర చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీ రును నిరసిస్తూ శనివారం శ్రీరంగాపురం మం డల రైతులు కొల్లాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెబ్బేరు మండలంలోని పలు గ్రామాల రైతులు కూడా వీరికి జత కలవడంతో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేసి నా లుగైదు రోజులు గడుస్తున్నా.. లారీల్లేక మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపించారు. తూకమైన వడ్లకు తరుగు పేరిట నాలుగైదు కిలోలు తగ్గిస్తున్నారని వాపోతున్నా రు. ఈ సందర్భంగా శ్రీరంగాపురం సింగిల్ విం డో అధ్యక్షుడు జగన్నాథంనాయుడు మాట్లాడు తూ.. రైతులపై ప్రభుత్వం మొండి వైఖరిని అవలంభిస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వరరెడ్డి, రాధాకృష్ణ, రమేశ్, పర్వతాలు, నగేశ్, వెంకటయ్య, శ్రీరాముడు తదితరులు పాల్గొన్నారు.