మహబూబ్‌నగర్, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు స్థానిక స ంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో కదిలిన సర్కార్ ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ముందుగా జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్లు, జె డ్పీటీసీలు, ఎంపీటీసీల ఎన్నికలు తొలుత నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు ఉమ్మడి మ హబూబ్‌నగర్ జిల్లాలో ఐదు జెడ్పీటీసీలు, 77ఎంపీపీ స్థానాలను ఖరారు చేసింది.
చాలా మండలాల్లో నగరపాలక సంస్థల్లో కలిపినప్పటికీ.. రాజకీయ నేతలకు అవసరమైన అన్నిసీట్లు పెంచి సంతృప్తి పరిచింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఇంకా క్లారిటీ రాలేదు. సీట్లు ఖరారు చేసిన రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని జిల్లాల్లో ఆశావాహులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రిజర్వేషన్లు.. ఇతరత్రా అం శాలపై అంచనాలు వేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ తనకు అనుకూలంగా రిజర్వేషన్లను మార్చుకునేందుకు లోలోపల ప్రయత్నాలు చేస్తున్నట్లు విపక్షాలు విమర్శిస్తున్నాయి.
అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని గెలుపు సాధిస్తామని ధీమా ఉన్న మండలాల్లో మాత్రమే తమ అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చేవిధంగా జిల్లా కలెక్టర్లకు జెడ్పీ సీఈవోలకు లోలోపల ఆదేశాలిస్తున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందుగా అన్ని నియోజకవర్గాల్లో మండలస్థాయిలో కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నది. మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు, అలంపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగారు. అన్ని మండల కేంద్రాల్లో ఊహించని విధంగా కార్యకర్తలు సమావేశాలకు వస్తుండడంతో ఉత్సాహం వెళ్లి విరుస్తోంది.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్‌లో వాగ్దానం ఇచ్చింది. అంతేకాక ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సీఎం పీఠం అధిష్టించారు. ఈ నేపథ్యంలో సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని భావించినా ప్రభుత్వం పాలనపై పట్టులేకపోవడంతో ప్రజాపాలన విఫలమైంది. దాదాపు 20 నెలలు గడుస్తున్నా ఇంకా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొంతమంది కోర్టుకు వెళ్లగా హైకోర్టు సెప్టెంబర్ 30లోపు అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్లను ఇంతవరకు ఖరారు చేయకపోవడంతో దానికి చట్టబద్ధత లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా వాయిదా పడతాయనే డైలామో నెలకొంది. ఈ లోపు సర్కార్ ఆర్డినెన్సు తీసుకొచ్చి స్థానిక సంస్థలు ఎన్నికలను జరిపించాలని ముందుకు వెళుతుంది. దీంతో సర్కారు చర్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. విపక్షాలు దీనిపై విరుచుకుపడుతున్నాయి. స్పష్టమైన హామీ ఇవ్వకుండా బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా సర్కా రు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీలు, మండల పరిషత్ ఎన్నికలకు లైన్ క్లియర్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. మొత్తంమీద బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తారా లేదా అనేదానిపై పీటముడి పడింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో జరిగిన మాదిరిగానే రాజకీయ బద్ధ శత్రువులైన కాంగ్రెస్, బీజేపీలో మళ్లీ ఒకటయ్యే సూచనలు కల్పిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీజేపీకి తగినంత క్యాడర్ లేకపోవడం స్థానిక సంస్థల్లో పట్టులేకపోవడం ఉన్న కొద్దిమంది కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ నేతలతో కలిసి లోపాయి కారిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో కూడా కొన్ని మున్సిపాలిటీల్లో మండల పరిషత్‌లలో జిల్లా పరిషత్‌లో ఇదేవిధంగా కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. అయినప్పటికీ బీఆర్ఎస్ ప్రభంజనానికి ఈ రెండు పార్టీలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయా యి. అధికారం మారడంతో చాలామంది స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ మారుతారని భావించిన ఆశించిన స్థా యిలో మారకపోవడంతో అధికార పార్టీ కంగు తిన్నది.
ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనూహ్య విజయం సాధించడం అధికార పార్టీకి చెం పపెట్టుగా మారింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని బీజేపీతో కలిసి పోటీ చేయాలని లోపాయికారీగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చాలా చోట్ల ఈ రెండు పార్టీలు కలిసి స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీకి దిగుతాయని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు ఓట్లు చీలకుండా ఈ ప్రయత్నం చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఒకరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంపైన స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. ఆశావహులు రంగం సిద్ధం చేసుకుంటున్నప్పటికీ సర్కారు ధైర్యం చేసి నోటిఫికేషన్ ఇస్తుం దా లేదా వేచి చూడాల్సి ఉంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనీ అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించే దిశగా ఇప్పటినుంచే కసరత్ ప్రారంభించింది. రాష్ట్రస్థాయి ఆదేశాల మేరకు నాగర్‌కర్నూల్ వనపర్తి నారాయణపేట, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తోంది. గతంలో స్థానిక సంస్థల్లో గెలుపొందిన నేతలతోపాటు కొత్త యువరక్తం ఉత్సాహంతో సమావేశాలకు తరలివస్తున్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఇవన్నీ వీఆర్ఎస్కు అనుకూల అంశాలు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా అన్ని మండలాల్లో క్యాండి డేట్లను ఎంపిక చేసేందుకు కమిటీలు వేస్తున్నారు. మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, వాణిదేవి, గోరటి వెంకన్నతోపాటు గద్వాల జిల్లాకు చెందిన మాజీ శాట్ చైర్మన్ ఆంజనేయగౌడ్, బాసు హనుమంతునాయుడు, విజయ్‌కుమార్, కుర్వ పల్లయ్య, నాగర్‌దొడ్డి వెంకట్రాములతోపాటు ముఖ్య నేతలందరూ సన్నాహక సమావేశాలను ప్రతిష్టాత్మకంగా