నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : కేటీఆర్ ఒత్తిడికి కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులపై కాంగ్రెస్ ప్రభు త్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడంతో ఉమ్మడి పాలమూ రు జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా బుధవా రం జిల్లాలోని నార్లాపూర్, వట్టెం రిజర్వాయర్ల పనుల ను పరిశీలించనున్నారు. బీఆర్ఎస్ హయాంలో దాదాపుగా పూర్తైన పథకం పనుల ఫలాలు రైతులకు ఏడాదిగా అందని ద్రాక్షగా మిగిలాయి. ఈ క్రమంలో వట్టెం రిజర్వాయర్ ముంపునకు గురికావడంతో ఈ డిసెంబర్కైనా పథకం ప్రారంభమయ్యేనో లేదోననే సందేహాల మధ్య మంత్రుల పర్యటన ఆసక్తి రేపుతోంది.
దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేపట్టిన బృహత్తర పథకం పా లమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల ప్రగతి కాంగ్రెస్ ఏడాది పాలనలో అటకెక్కాయి. దాదాపుగా 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకానికి సంబంధించి జిల్లాలోని కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద అంజనగిరి రిజర్వాయర్‌ను ఏడాది కిందట కేసీఆర్ ప్రారంభించారు. అప్పటికే ఏదుల, వట్టెం రిజర్వాయర్ల పనులూ దాదాపుగా పూర్తయ్యాయి. గత డిసెంబర్ నా టికే ఈ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు బీఆర్ఎస్ ప్ర భుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత పది నెలలుగా ఈ ప్రాజెక్టును పూర్తిగా విస్మరించింది. సంబంధిత ఏజెన్సీ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏదుల, వట్టెం రిజర్వాయర్లు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు.
పాలమూ రు బిడ్డగా చెప్పుకొంటున్న సీఎం రేవంత్తోపాటుగా రా ష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు సైతం ఇప్పటి వరకు ప్రాజెక్టును సందర్శించలేదు. గతంలో హైదరాబాద్‌లో సమీక్షా సమావేశాలకే పరిమితమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పరిస్థితిని చూడకపోవడంతో ప్రాజెక్టు పనుల్లో జాప్యం ఏర్పడింది. తద్వారా గత డిసెంబర్లో ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్టు ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇదిలా ఉంటే ఇటీవలి వర్షాలకు శ్రీపురం, కుమ్మెర తదితర ప్రాంతాల్లో అడిక్ట్ల గుండా చేరిన వరద నీరు వట్టెం రిజర్వాయర్‌ను ముంచింది. దీనివల్ల రూ.5వేల కోట్ల విలువైన ప్రాజెక్టు పరిధిలో రూ.2వేల కోట్లకుపైగా విలువైన మోటర్లు నీట మునిగాయి.
ఈ నీటి తోడివేత పూర్తిస్థాయిలో జరగక పనులకు మరింత ప్రతిబంధకంగా మా రింది. ఈ డిసెంబర్లో రిజర్వాయర్లను ప్రారంభిస్తామ ని ప్రభుత్వం పేర్కొంటున్నా ప్రస్తుతం మునక వల్ల అది జరుగుతుందా లేదా అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల జిల్లాకు వచ్చిన బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి పాలమూరులో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన ప్రాజెక్టు పనులను ప్రజల ముందుంచేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.
మేడిగడ్డ తరహాలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ నాయకత్వం పాలమూరు ఎత్తిపోతలను సందర్శిస్తామని, పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్న రేవంత్ స్పందించాలని డిమాండ్ చేశారు. సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఒక్కసారైనా ప్రాజెక్టును సందర్శించారా అ ని నిలదీశారు. ఇలా కేటీఆర్ చేసిన ప్రకటనతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. ఇందులో భాగంగా బుధవారం నార్లాపూర్, వట్టెం రిజర్వాయర్లను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సారథ్యంలో నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, ఉమ్మడి పాలమూరు కాంగ్రె స్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర నేతలు సందర్శించనున్నారు. ఇప్పటికే నల్లమలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఇలా ఓసారి పర్యటించిన మంత్రుల బృందం వల్ల ఇప్పటికీ పెద్దగా జరిగిన అభివృద్ధి కనిపించలేదు. ఈ పర్యటన కూడా అలాగే ఉంటుందా, మం త్రుల పర్యటన తర్వాతేమైనా మార్పు వస్తుందో వేచి చూడాల్సి ఉన్నది.