మహబూబ్‌నగర్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం నుంచి చేపట్టనున్న సమగ్ర ఇంటింటి సర్వేపై ప్రజ ల్లో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. కులం, ఆస్తులు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వివరాలతోపాటు వ్యక్తిగత ఆదాయ వివరాలు అన్నింటినీ లెక్కించి ఇందులో పొందుపరుస్తున్నారు. ఇదే గను క జరిగితే చివరకు గ్యారెంటీలకు పనికిరావని తేల్చే లా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. పేదలను తప్పిస్తే అంతంత మాత్రంగా ఆదాయం ఉన్న మ ధ్య తరగతి వర్గాల ప్రజలు హుందాగా బతికేందుకు ఇంటిల్లిపాది కష్టపడి పనిచేస్తున్నారు. అయితే ఈ వివరాలన్నీ ప్రభుత్వం సేకరిస్తుండడంతో వారందరూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు దూరమ య్యే పరిస్థితి ఉంది. 11 నెలల కిందట ఆరు గ్యా రెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పా ర్టీ ఇప్పటివరకు ఆ హామీలు అమలు చేయకపోగా తాజాగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేరుతో వివరాలను సేకరించేందుకు సిద్ధమైంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సమగ్ర కుటుం బ సర్వేకు ప్రత్యేకాధికారులను నియమించి ఎన్యుమరేటర్లను కూడా సిద్ధం చేశారు. జిల్లాల వారీగా సిబ్బందిని సర్వేకు కేటాయించి సర్వే ఎలా చేపట్టాలి ఏఏ అంశాలపై సర్వే చేయాలి అనే అంశాలపై పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం లో ఒకే రోజు కుటుంబ సమగ్ర సర్వేను చేపట్టి రి కార్డు సృష్టించగా అప్పట్లో చేపట్టిన సర్వే కేవలం కు టుంబ సమగ్ర వివరాలు మాత్రమే సేకరించింది. వారి వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వేపై ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు వస్తుండడంతో జనంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. కుటుంబ సర్వేలో పొందుపరిచిన అంశాలు అన్నింటినీ లెక్కిస్తే ప్రభుత్వం ఇచ్చే ఏ ఒక్క గ్యారెంటీకి కూడా అర్హులయ్యే పరిస్థితి కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
అంతేకాకుండా కులం, ఆ దాయం, పశు సంపద వాహనాలు, స్థిర చరాస్తులతోపాటు వ్యక్తిగత ఆదాయాలు, అప్పులు అన్ని వివరాలు బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నివాసం ఉన్న ఇల్లు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆ స్తులు వ్యవసాయ పొలాలు కౌలుకు తీసుకున్న పం ట పొలాలు ప్రభుత్వ నుంచి పొందిన లబ్ధి వివరా లు సేకరిస్తున్నారు. మరోవైపు ఇందులో పొందుపరిచిన వివరాలు అన్ని చెబుతారా? నిరాకరిస్తారా? మరోవైపు మధ్యతరగతి ఎగువ తరగతికి చెందిన కుటుంబాలు తమ ఆస్తులు, అంతస్తులు వివరాలు చెప్పేందుకు నిరాకరించే అవకాశాలు ఉన్నాయి. మ రోవైపు కొంతమంది రైతులకు ఇప్పటికీ భూమి సా గు చేసుకుంటున్న ధరణి సమస్యల వల్ల పాస్‌బుక్కులు రాలేదు. మరి కొన్నిచోట్లా కోర్టు కేసులు నడుస్తున్నాయి. దీనిపై క్లారిటీ లేదు. అనేక అనుమానాల మధ్య సాగుతున్న ఈ సర్వే సాఫీగా సాగుతుం దా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదాయ వివరాలు అన్ని చెప్పాల్సిందే..
కాంగ్రెస్ సర్కారు చేపడుతున్న సమగ్ర ఇంటిం టి కుటుంబ సర్వేలో పొందుపరిచిన వివరాల్లో ఆస్తులు, అంతస్తులు, అప్పులు ఇతర వ్యక్తిగత వివరాలు చాలానే ఉన్నాయి. కుటుంబ సభ్యులు చేసే పని వారి వేతనంతోపాటు ఇతర వ్యక్తిగత అంశాల న్నీ ఈ సర్వేలో చెప్పాల్సిందే. దాదాపు 75 అంశా ల్లో ఎన్యుమరేటర్లు ప్రజలను ప్రశ్నించి వివరాలు సేకరించే అవకాశం ఉన్నది.
పదేండ్లలో పెరిగిన వ్యక్తిగత ఆదాయం..
తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజ ల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవంగా బతికేస్థాయి కూడా వచ్చింది. సాగు, తాగు నీటిపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ వల్ల వలసలు ఆగిపోయి ఉన్న ఊర్లోనే ఉపాధి పెరిగేలా చేసింది. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చే పరిస్థితి ఉండేది. దీనివల్ల చాలామంది ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూనే తమ వ్యక్తిగత సంపదను సృష్టించుకున్నారు. వ్యవసాయదారులు రైతుబంధు లాంటి పథకాల వల్ల దిగుబడి పెరిగి ప్రభుత్వ మద్దతుధరతో ధాన్యం అమ్మి కాస్తోకూస్తో వెనుకేసుకున్నారు.
కులాలవారీగా ప్రోత్సాహం లభించడంతో గొర్రెలు, బర్రెలు, పశుసంపద కూ డా గణనీయంగా పెరిగింది. ఇక మధ్య తరగతి ప్ర జలు ఉపాధి అవకాశాలు పెరిగి ఇంట్లో ఉన్న అందరూ కష్టపడి సంపాదించే స్థితికి చేరుకున్నారు. అయినా అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కోత పెట్టలేదు. అడిగినా.. అడగకున్నా అన్నీ సమకూర్చింది. అయితే కేసీఆర్ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తామని ఆశచూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 11 నెలల్లోనే హామీలను తుంగలో తొక్కింది. పైగా సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఈ వివరాలను తీసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులు కారని తేల్చేందుకు సిద్ధమైనట్లు ప్రభుత్వం పూనుకుందని పలువురు విమర్శలు చేస్తున్నారు.
సమగ్ర ఇంటింటి సర్వేపై ప్రజల అనాసక్తి..
సమగ్ర ఇంటింటి సర్వే పేరుతో గత నెలలో పై లట్ ప్రాజెక్టులో భాగంగా మున్సిపాలిటీలను గ్రామపంచాయతీలను ఎంపిక చేసి వివరాలు సేకరించిం ది. అయితే అప్పట్లో అడిగిన వివరాలు మామూలు గా ఉండడంతో జనం ఈ వివరాలన్నీ వెల్లడించా రు. ప్రస్తుతం చేపడుతున్న సర్వేలో కులం గోత్రంతోపాటు అన్ని రకాల వ్యక్తిగత వివరాలు కుటుంబ వివరాలు కూడా తెలియజేయాల్సిందే.. ఇదే గనక జరిగితే పేదవర్గాలు తప్పించి మధ్య తరగతి వ ర్గాలు సంక్షేమ కార్యక్రమాలకు పూర్తిగా దూరమ య్యే పరిస్థితి ఉంది. చాలామంది సొంతిల్లు లేకుం డా అదే ఇండ్లలో తమకున్న సంపాదనతో జీవిస్తున్నారు.
పేరుకే అద్దెఇల్లు అయినప్పటికీ అన్ని వసతులు సమకూర్చుకున్నారు. పిల్లలను మంచి స్కూ ళ్లకు పంపించి ఒక పూట పస్తులున్నా మంచిగా చదువులు చదివిస్తున్నారు. ఇవన్నీ వివరాలు సర్వేలో వస్తే ఈ కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉంటుంది. టీవీ, బైకు ఇతర వ్యక్తిగత ఉపాధి అవకాశాలన్నీ పొందుపర్చాలి. అప్పులు కూడా వెల్లడించాలి. సర్వే మధ్యతరగతి ప్రజలకు ఆశనిపాతంలా తయారైందని అంటున్నారు. ఇక ఉన్నత కుటుంబా లు ఈ సర్వేలో వివరాలు అందిస్తే ఇక అంతే సంగతులు. అని పన్నుల రూపేణా.. ఇతరత్రా మార్గాల ద్వారా ముక్కు పిండి వసూలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వలసల డాటా బహిర్గతం చేస్తారా..?
కుటుంబ సర్వేలో వలసలు వెళ్లిన అంశాన్ని కూ డా ప్రస్తావించారు. ఇది మంచి పరిణామమే. అయి తే ఉమ్మడి జిల్లాలో వలసలు తగ్గుముఖం పట్టి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మళ్లీ వలసలు పెరిగాయి. ప్ర భుత్వ విధానంలో తేడా రావడంతో చాలామంది బతుకు దెరువు కోసం వలసబాట పట్టారు. గ్రా మీణ ప్రాంతాల్లో చాలామంది వలసలు వెళ్లిన పరిస్థితి ఉంది. కుటుంబ సర్వేలో ఎంతమంది వలస వెళ్లారు అనే విషయం తేలనున్నది. ఈ వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేసే దమ్ముందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద కుటుంబ సర్వే జనం లోపల అనేక భయాందోళనలు కలిగిస్తున్నాయి. గ్యారెంటీలను మంగళం పాడడానికి వారి వ్యక్తిగత వివరాలు సేకరిస్తుందని బీఆర్ఎస్ నేతలు
బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.