వనపర్తి, జూన్ 3(నమస్తే తెలంగాణ) : రాజకీయాల్లో విష సంస్కృతికి సీఎం రేవంత్‌రెడ్డి ఆజ్యం పోస్తున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నా పోటీ చేయించి వారి అభ్యర్థిని ఆర్థికంగా లూఠీ చేయించారని ఎద్దేవా చేశారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దశాబ్ది ఉ త్సవాల సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి మాజీ మంత్రి జెండావిష్కరణ చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపు ప్రజాస్వామ్యానికి నిలువుటద్దమన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఇవి ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమన్నా రు. పదేండ్ల తర్వాత 64 సీట్లు గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతున్నదని.. దాడులను సీఎం రేవంత్ ప్రోత్సహిస్తున్నాడని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్కు 88సీట్లు వచ్చినా హత్యలు, భౌతిక దాడులు, అరాచకాలు లేవని, వ్యక్తిగత శత్రుత్వాలకు తావులేకుండా కేసీఆర్ పాలన కొనసాగిందన్నారు. దేశంలో 15 రాష్ర్టాలకుపైగా ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు స్థానిక ప్రజాప్రతినిధుల బలగాన్ని చూసి కాంగ్రెస్ భయపడుతుందన్నారు. కొత్త బిచ్చగాళ్ల మాదిరి కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని, కాంగ్రెస్‌పై ప్రేమ ఉండి ప్రజలు అధికారం ఇవ్వలేదన్నది ఇప్పటికైనా గుర్తించకపోతే అభాసు పాలుకావడం తథ్యమని హెచ్చరించారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మినహా మిగతా హామీలన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. కేసీఆర్ పెట్టిన పథకాలను మార్పుచేయడంతోనే కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు సంతోషించేలా పాలన లేద ని, దీనిపై మేధావులు మౌనం వీడాలన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని పత్రికలు, రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా మెలుగుతూ రాక్షసానందం పొందుతున్నాయన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రతిఘటనను చవిచూస్తారని హెచ్చరించారు.
శ్రీధర్‌రెడ్డి హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మంత్రి జూపల్లి వ్యవహారశైలితో నాగర్‌కర్నూల్, వనపర్తి జి ల్లాలు కల్లోలిత ప్రాంతాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీధర్‌రెడ్డి హత్య జరిగి 11రోజులు పూర్తయినా హంతకులను పట్టుకోవడంలో నిర్లక్ష్యమెందుకని ప్రశ్నించారు. రాజకీయం గా అనుమానం ఉన్న వ్యక్తులతో విచారణ జరిపి మ మ అనిపించారన్నారు. శ్రీధర్‌రెడ్డి హత్యలో మంత్రి జూపల్లి సమాచారాన్ని దాస్తున్నారని, ఇది పోలీసులకు కూడా తెలుసని ఆరోపించారు. హత్యపై సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు. మధ్యప్రదేశ్‌లో 65 మంది మృతికి కారణమైన సోం డిస్టిలరీస్‌ను రాష్ర్టానికి తెచ్చిన ఘటనలో మంత్రి జూపల్లి గందరగోళానికి గురై మాట్లాడుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెచ్చగొట్టే మాటల వల్ల కాంగ్రెస్ శ్రే ణులు మరింత రెచ్చిపోతున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదికాదని, కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి శ్రీధర్, పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జ్జి అభిలాష్‌రావు, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ తిరుపతిరెడ్డి, శ్యామ్యనాయక్, లక్ష్మారెడ్డి, రమేశ్‌గౌడ్, విజయ్‌కుమార్, అ శోక్, బాలీశ్వర్‌రెడ్డి, కృష్ణయ్య, పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.