కొడంగల్, నవంబర్ 8: ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ జాతర ఇరవై రోజులు మాత్రమే ఉంటుందని, ఆ తరువాత ప్రజలు తిప్పికొడితే అడ్రస్ లేకుండా పోతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మం డలంలోని చిట్లపల్లి, ఖాజాఅహ్మద్‌పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయం రావడంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వస్తుందని, ఎన్నికల పర్వం ముగిసిందంటే మళ్లీ కనుమరుగవుతుందన్నారు. కాబట్టి ప్రజ లు వారి మాటలకు మోసపోకుండా అభివృద్ధిని ఆకాంక్షించే బీఆర్ఎస్ పార్టీని గెలిపించు కోవాలని కోరారు రేవంత్‌రెడ్డిని కొడంగల్ ఆదరించినప్పటికీ నిండా ముంచినట్లు పేర్కొ న్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే కొడంగల్ రూపు రేఖలు మారాయని, కోట్ల నిధులతో కొడంగల్ అభివృద్ధిని సాధించిందన్నారు. రూ.300ల కోట్ల తో రేవంత్‌రెడ్డి పీసీసీ పదవిని కొనుక్కొన్నాడని, ఆ డబ్బులతోనే నియోజకవర్గంలోని నాయకులను కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపించారు. అమ్ముడుపోయే నాయకుల తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పే నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని తెలిపారు. మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలో.. నిరంతర విద్యుత్ సరఫరా చేసే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో రైతులు ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక ప్రజలను ఒక్కసారి అడిగితే వారి బాధలు తెలుస్తాయని, ఎందుకు కాంగ్రెస్‌ను గెలిపించుకున్నా మని బాధ పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్ మధుసూదన్‌రావు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, సర్పంచ్‌లు గుండప్ప, గోవిం ద్, అంజప్పలతో పాటు బీఆర్ఎస్ నాయకులు కాశప్ప, భీములు తదితరులు పాల్గొన్నారు.
బొంరాస్‌పేట, నవంబర్ 8 : అనారోగ్యంతో మంగళవారం మృతిచెందిన మండలంలోని కాకర్లగండితండా సర్పంచ్ లక్ష్మీబాయి మృతదేహానికి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, పార్టీ నాయకులు మహేందర్‌రెడ్డి, దేశ్యానా యక్ తదితరులు బుధవారం నివాళి అర్పించారు.