ఊట్కూర్ : తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (Child Rights Protection Commission) చైర్‌పర్సన్‌గా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి (Seetha Dayakar Reddy) ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్ పర్సన్‌గా ఎంపికై బాధ్యతలు స్వీకరించి శనివారం స్వగ్రామం చిన్నచింతకుంట మండలం పర్కాపురం( Parkapuram) గ్రామానికి ఆమె చేరుకుంది.
విషయం తెలుసుకున్న ఊట్కూర్, కృష్ణ, మాగనూర్, మక్తల్, నర్వ మండలాలకు చెందిన కాంగ్రెస్( Congress) సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గ్రామానికి వచ్చి సీతమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఊట్కూర్ మాజీ పీఏసీఎస్ చైర్మన్ ఎల్కోటి నారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ మణెమ్మ, మోహన్ రెడ్డి, కృష్ణ మండలం హిందూపూర్ గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మీ నారాయణ గౌడ్, ఉసేనప్ప గౌడ్, సద్దాం హుస్సేన్ తదితరులు ఉన్నారు.