
మక్తల్ రూరల్, డిసెంబర్ 17 : పట్టణంలోని ఎస్బీఐ ఏడీబీ బ్యాంక్ పరిధిలో మండలంలోని వివిధ మహిళా స మైక్య పొదుపు సంఘాల రుణాల రికవరీలో లెక్కలు తేల డం లేదు. ఇంతవరకు ఏ సంఘం వారు ఎన్ని వాయిదాలు చెల్లించారో తెలియకపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రుణాల రికవరీలో స్థానిక సీఎస్పీ పాయింట్ మాజీ నిర్వాహకురాలు జానకి మహిళా సంఘాల వద్ద డబ్బులు తీసుకొని బ్యాంక్‌లో ఆయా సంఘాల పేరుపై ఉన్న ఖాతా లో జమ చేయకపోవడంతో పెద్దఎత్తున్న నిధులు దుర్వినియోగం అయ్యాయి. కుంభకోణం జరిగి వారం రోజులు గ డచినా ఇంతవరకు అధికారులు మహిళా సంఘాల రుణా ల చెల్లింపులో ఖాతాలను పూర్తి స్థాయిలో విచారణ చేయక పోవడం గమనార్హం. కుంభకోణాన్ని ఈనెల 7న “నమస్తే తెలంగాణ దినపత్రిక” వెలుగులోకి తెచ్చింది.
ఇదిలా ఉండగా సీఎస్పీ పాయింట్లో జరిగిన అక్రమా లు, మహిళా సంఘాల ఖాతాల నుంచి నిధులు దారి మళ్లించిన వ్యవహారంలో ఎస్బీఐ బ్యాంక్‌లో పని చేసిన ఇద్దరు ఉద్యోగులు కీలక పాత్ర నిర్వహించినట్లు తెలిసింది. పట్టణంలోని ఎస్బీఐ ఏడీబీ బ్యాంక్ వద్దకు పలు గ్రామాల మ హిళా సంఘాల సభ్యులు వచ్చి తమ ఖాతాలను సరి చూశా రు. దీంతో చాలా సంఘాల రుణాల రికవరీ డబ్బులు గల్లం తు జరిగినట్లు సమాచారం. ఈమేరకు భూత్పూర్ గ్రామానికి చెందిన అయ్యప్ప మహిళా సంఘం సభ్యురాలు తమ సంఘం పేరుపై ఆరుసార్లు రూ.1500 చొప్పున చెల్లించాన ని, తీర తమ సంఘం ఖాతాలో డబ్బులు ఎందుకు జమ చేయలేదని సీఎస్పీ పాయింట్ మాజీ కరస్పాండెంట్‌తో గొ డవ పడ్డారు. దాదాపు రూ.9వేలు దుర్వినియోగం చేసింద ని ఆమె వాపోయింది. అలాగే మాగనూర్ మండలంలోని నేరడిగొమ్ము గ్రామానికి చెందిన మహిళా సంఘం సభ్యురాలు రూ.18 వేల చొప్పున మూడుసార్లు సీఎస్పీ పాయింట్లో జమ చేయగా తమ సంఘం ఖాతాలో రూ.36 వేలు తేడా ఉన్నట్లు ఆరోపించింది. దీంతో ఆయా గ్రామాల మహిళా సంఘాల బాధితులు నిధుల గోల్‌మాల్‌పై ఆందోళన వ్యక్తం చేశారు.
తాము ఎంతో కష్టపడి పొదుపు చేయించుకున్న డబ్బులు సైతం సీఎస్పీ నిర్వాహకురాలు అవినీతి అక్రమాలకు పా ల్పడిందని ఆరోపించారు.మహిళా సంఘాల ఖాతాలు తేడా ఉన్న వాటిని పరిశీలించి సరి చేయాలని ఎస్బీఐ బ్యాంక్ ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ బ్యాంక్ సిబ్బంది పట్టించుకోవడం లేదన్నారు. దీంతో ప్రతిరోజూ ఆయా గ్రామాల మహిళా సం ఘాల సభ్యులు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయో లే దోనని ఆందోళన చెందుతున్నారు. అవినీతికి పాల్పడిన సీ ఎస్పీ పాయింట్ కరస్పాండెంట్ నుంచి రూ.7 లక్షల వరకు బ్యాంక్‌లో డిపాజిట్ చేయించారు. తాను దాదాపు 100 ఖాతాల డబ్బులు బ్యాంక్‌లో జమ చేయలేదని, ఈ ఖాతాలకు పూర్తి బాధ్యత తనదేనని సీఎస్పీ మాజీ నిర్వాహకురాలు రాత పూర్వకంగా బ్యాంక్ మేనేజర్‌కు హామీ పత్రాన్ని ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కేవలం 47 సంఘాల స భ్యుల ఖాతాలను సరి చేసి డబ్బులను బ్యాంక్‌లో చెల్లించినట్లు తెలిసింది. మిగతా 53 ఖాతాల సంగతి ఏమిటీ ? అని పలువురు మహిళా సంఘాల సభ్యులు ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఏయో సంఘం వారు ఎంత డబ్బులు చెల్లించారు.? ఇంకా ఎన్ని చెల్లించాలి? అనేది తెలియడం లేదు. అయితే సదరు సీఎస్పీ నిర్వాహకురాలు ఇంకా ఎన్ని సం ఘాల నిధులు దుర్వినియోగం చేశారో? అధికారులు స మగ్ర విచారణ చేస్తే మరిన్ని ఖాతాల భాగోతం బయటప డే అవకాశం ఉంది.
ఉద్యోగుల పాత్రపై అనుమానాలు
ఎస్బీఐ పక్కన ఉన్న సీఎస్పీ పాయింట్లో మహిళా పొ దుపు సంఘాలు తీసుకున్న రుణాల రికవరీలో జరిగిన అక్రమాలపై ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు కీలక పాత్ర ని ర్వహించినట్లు తెలిసింది. సీఎస్పీ పాయింట్లో మహిళా సంఘాల సభ్యులు చెల్లించిన రుణ వాయిదాల డబ్బులు బ్యాంక్‌లో జమ చేయకుండా పక్కదారి పట్టించారు. ఈ వ్యవహారంపై బ్యాంక్‌లో పని చేసి బదిలీపై వెళ్లిన క్యాషియర్, పదవీ విరమణ చేసిన బ్యాంక్ అకౌంటెంట్ కలిసి సదరు సీఎస్పీ పా యింట్ కరస్పాండెంట్‌కు సహకరించినట్లు విశ్వాసనీయ వ ర్గాల సమాచారం. ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు సీఎస్పీ పా యింట్ నిర్వాహకురాలు ఇంట్లోనే అద్దెకు ఉండి నిధుల దు ర్వినియోగానికి పరోక్షంగా సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
బ్యాంక్ ఉద్యోగుల సహకారం వల్ల ఇంత పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. అలాగే మహిళా సంఘాల రుణాలు మాత్రమే కాకుండా మున్సిపాలిటీ పరిధిలోని పింఛన్లు, రైతుబంధు పథకం డబ్బుల్లో కూడా సీఎస్పీ పాయింట్ నిర్వాహకురాలు చేతి వాటం ప్రదర్శించి, అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. రైతుబంధు డబ్బులను సంబంధిత రైతు ల ఖాతాల నుంచి విత్‌డ్రా చేసి వారికి ఎన్ని డబ్బులు ఖా తాలో జమ అయ్యాయి.? ఎన్ని డబ్బులు విత్‌డ్రా చేసిన వివరాలు రైతులకు తెలియకుండా పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా బ్యాంక్ ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా సంఘాలు తీసుకున్న వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వాయిదాల చెల్లింపుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల సభ్యులు కోరారు.