మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 3 : రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో భర్తీ చేయనున్న వివిధ స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు మంగళవారంతో ముగిసాయని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు . పరీక్షలు పూర్తిగా ఆధునిక పరిజ్ఞానం రేడియో ఫ్రిక్వెన్సి ఐడెంటిఫికెషన్ పద్ధతి ద్వారా నిర్వహించినట్లు తెలిపారు. గత నెల 8వతేది నుంచి జనవరి 3 వరకు మొత్తం 22 రోజుల్లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం స్డేడియం గ్రౌండ్స్‌లో నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 23,745మంది ఆభ్యర్థులకుగానూ 21, 598 అభ్యర్థులు హాజరు కాగా 15,143 అభ్యర్థులు అర్హత సాధించినట్లు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుంచి ఆభ్యర్థులను గ్రౌండ్లోకి అనుమతించినట్లు తెలిపారు. మంగళవారం 1,383 మహిళా అభ్యర్థులు హాజరు కావల్సి ఉండగా, 1,280 మంది హాజరయ్యారు. వీరీలో 924 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు తెలిపారు.. దేహదారుఢ్య పరీక్షకు సాఫీగా సాగేందుకుగాను ఎగ్జామ్స్ చీఫ్ సూపరిటెండెంట్లు ఎస్పీలు ఆర్ వెంకటేశ్వర్లు, చేతన ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఈవెంట్స్‌లో నోడల్ ఆఫీసర్‌గా అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు మహేశ్, శ్రీనివాసులు, లక్ష్మణ్, ఏవో కృష్ణయ్య, ఏఆర్ డీఎస్పీలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం డీపీవో సిబ్బంది విధులు నిర్వహిస్తూ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.