గద్వాల, అక్టోబర్ 28 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో చేపట్టే నామినేషన్ ప్ర క్రియకు ఏర్పాట్లు చేయాలని, ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ హాల్లో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో నామినేషన్ల పరిశీలన, ఫారం-7ఏ దరఖాస్తు ప్రిపరేషన్‌పై మాట్లాడా రు. నామినేషన్ల స్వీకరణ, వాటి పరిశీలన, ఉపసంహరణ వంటి అంశాలు కీలకమైనవని, వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలన్నారు. నామినేషన్ ప్రక్రియ కోసం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సిబ్బంది ఏఏ పనులు నిర్వహించాలనేది ముందుగానే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
నామినేషన్ వేసే కార్యాలయంలో రెండు కంప్యూటర్లతోపాటు స్కానర్, ఫ్యాక్స్, నాలుగు సెట్ల ఓటర్ జాబితా, సీసీ టీవీ, వీడియోగ్రాఫర్, వాల్‌క్లాక్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, మైక్ తప్పనిసరి గా ఉండాలన్నారు. అకౌంట్ రిజిస్టర్, స్పీడ్ ఎక్కువగా ఉన్న ఇంటర్నెట్ ఏర్పా టు చేసుకోవాలన్నారు. నామినేషన్ వేసే సమయంలో ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, బారికేడ్లు ఏ ర్పాటు చేయాలన్నారు. నామినేషన్ ప రిశీలన రోజుకు అభ్యర్థికి 25 ఏండ్లు నిండి ఉండాలన్నారు. ఒక అభ్యర్థి నాలుగు నామినేషన్ సెట్ల వరకు వేయవచ్చన్నారు. ఉదయం 11 నుంచి సా యంత్రం 3గంటల వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుందని, ఆ తర్వాత స్వీకరించబడవన్నారు. మూడుగంటల లో పు వచ్చిన వారికి రిటర్నింగ్ అధికారి సంతకం చేసిన స్లిప్ అందించాలన్నా రు. నామినేషన్ వేసిన సమయాన్ని అ ధికారులు తప్పనిసరిగా నమోదు చే యాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5వేలు, మిగతా వారికి రూ.10 వేలు ధరావత్ చెల్లించాలన్నారు. నిబంధనల మేరకు అభ్యర్థితోపాటు మరో నలుగురిని మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాసులు, అపూర్వచౌహాన్, ఆర్డీవో చంద్రకళ పాల్గొన్నారు.