నాగర్‌కర్నూల్, మే 30 : జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహిం చి బడిబయటి పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని కలెక్టర్ ఉదయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత కలెక్టరేట్ సముదాయంలో జిల్లా, మండల విద్యాశాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యా ప్రమాణాల అమలు, అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతు ల పనుల పురోగతి, పాఠశాలలు తెరిచేలోపు విద్యార్థులకు న్యా యమైన ఏకరూప దుస్తు లు తయారు చేసి అందివ్వడం బడిబాట కార్యక్రమం నిర్వహణ సం బంధిత విషయాలపై కలెక్టర్ పలు సూచన లు సలహాలు అం దించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమై న గుణాత్మక విద్యను అందించాలనే లక్ష్యంతో అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి పాఠశాలల్లో ఉండాలి, వారికి వి ద్య అందాలనే ధృడ సంకల్పంతో అం కుటిత దీక్షతో విద్యాశాఖ పనిచేయాలన్నారు. పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల సరఫరా విధానాన్ని విద్యాశాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏకరూప దుస్తులు త్వరితగతి న మహిళా సంఘా ల ద్వారా రోజుకు 5 వేల ఏక రూప దు స్తులు సిద్ధమవుతున్నాయని, నిర్ధేశిత గడువు తేదీలోగా సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతు పనులు మండలాల వారీగా వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
బడిబాట కార్యక్రమా న్ని పండుగ వాతావరణంలో నిర్వహించడాని కి మూడు కేటగిరీల వారీగా విద్యార్థినీ, వి ద్యార్థులను గుర్తించాలని, బడుల్లో చే ర్చే సమయానికి అంతా సిద్ధం చే సుకోవాలని సూచించారు. ముఖ్యంగా అంగన్వాడీ నుంచి ప్రాథమిక పాఠశాలలకు, ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలలకు విద్యార్థులు నమో దు అయ్యేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పురోగతి పనులను క్షేత్రస్థాయిలో ఎంఈవోలు సందర్శించి పూర్తయ్యేలా చర్యలు చేపట్టమని, ఈ విద్యా సంవత్సరం చేపట్టబోయే విధివిధానాలపై చర్చించి బడిబాట కార్యక్రమం నిర్వహణపై సూచనలు, సలహాలు అందించారు. విద్యా విధానాలను ప్రతిరోజు చేపట్టే కార్యక్రమాలను వాట్సప్ గ్రూపుల్లో పొందు పరచాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కుమార్‌దీపక్, సీతారామారావు, ప్రభుత్వ పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖర్‌రావు, వివిధ శాఖల సంక్షేమ శాఖాధికారులు పాల్గొన్నారు.
జూన్ 9వ తేదీన జరగబోయే గ్రూప్-1 పరీక్షకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ జూన్ 9న జరగబోయే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలో 18 గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 5221 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు కావాల్సిన కనీస సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష జరగనుందని, అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం 9 గంటల నుంచి అనుమతిస్తామన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తమ వెంట తీసుకురావద్దని, బూట్లను ధరించవద్దని సూచించారు. పరీక్షా కేంద్రం చుట్టూ 144 సెక్షన్ విధించనున్నట్లు తెలిపారు.
పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి మౌలిక వసతులు సిద్ధం కావాలని కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఆదేశించారు. గురువారం నాగర్‌కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా చేపట్టిన మరమ్మతు పనులు, మౌలిక సదుపాయా లు వేగవంతంగా పూర్తి చేయడమే కాకుండా నాణ్యతతో కూడిన పనులు జరగాలని ఆదేశించారు. తాగునీటి వసతి, వంటగది, మరుగుదొడ్లు సహా చిన్న చిన్న మరమ్మతు పనులు పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర్లశెట్టి, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.