ఊట్కూర్/మాగనూరు, నవంబర్ 27 : మాగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో వారంలో మూడుసార్లు ఫుడ్‌పాయిజన్ అయిన ఘటన కలకలం రేపుతున్నది. అధికారులు నిత్యం పర్యవేక్షణ జరుపుతు న్నా ఫలితం లేకుండా పోతున్నది. కాగా, కలుషితాహారంపై అధికారులు తలా ఒక సమాధానం చెబుతున్నారు. విద్యార్థులపైకి నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, అధికారుల మాటల ను విద్యార్థుల తల్లిందండ్రులు తప్పు పడుతున్నా రు.
తాము పిల్లలకు డబ్బులే ఇవ్వనప్పుడు దుకాణాల్లో చిరుతిండ్లు ఎలా కొనుగోలు చేస్తారంటూ ప్ర శ్నిస్తున్నారు. వీటికి అధికారుల నుంచి సమాధానం లేకుండాపోతున్నది. తాము ఏమైనా చిన్నపిల్లలమా..? కుర్కురేలు తినడానికి..? అంటూ విద్యార్థులు నిలదీస్తున్నారు. మాగనూరు పాఠశాలలో వా రం రోజులుగా అధికారుల పర్యవేక్షణలో మధ్యాహ్న భోజనం వండిస్తున్నప్పటికీ మంగళవారం 30 మంది విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి రావడంతో ఉపాధ్యాయులు తమ వాహనాల్లో విద్యార్థులను చికిత్స కోసం మక్తల్ దవాఖానలో చేర్పించా రు.
తమకు ఉడకని వంకాయ, ఆలుగడ్డ కర్రీ వడ్డించారని, అన్నంలో సైతం పురుగులు వచ్చినట్లు చికిత్స పొందుతున్న విద్యార్థులు చెబుతున్నారు. కా నీ, అధికారులు మాత్రం విద్యార్థులు దుకాణాల్లో దొరుకుతున్న కుర్కురేలు, బిస్కెట్లు, చాక్లెట్లు, పొలా ల్లో కంది బుడ్డలు తినడంతో అస్వస్థతకు గురవుతున్నట్లు మీడియాకు లీకులిచ్చారు. ప్రభుత్వ వైఫల్యం నుంచి తల్లిదండ్రుల దృష్టిని మరల్చేందుకు పోలీసులను రంగంలోకి దించి చిరుదుకాణాలు, కిరాణా షాపుల్లో సోదాలు జరిపించారు.
అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు వివిధ పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు వస్తున్నారనే ముందస్తు సమాచారం మేరకు.. కలెక్టర్, ఎస్పీ ఆదేశాలతో తాసీల్దార్ సురేశ్‌కుమార్ పాఠశాల ఆవరణ చుట్టూ 144 సెక్షన్ వి ధించారు. అయితే, మండలకేంద్రానికి చేరుకున్న ప లు విద్యార్థి సంఘాల నాయకులు, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాసర్, అంబేదర్ యువజన సంఘం అధ్యక్షుడు పృథ్వీరాజ్, ఎమ్మార్పీఎస్ నా యకుడు నాగేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగూరావు నామోజీ, ప్ర ధాన కార్యదర్శి భాసర్, ఉపాధ్యక్షుడు సోమశేఖర్ విద్యాసాగర్, మండలాధ్యక్షుడు నారాయణ, నాయకులు అశోక్ గౌడ్‌తోపాటు దాదాపు 42 మందిని పాఠశాలకు 200 అడుగుల దూరంలోనే డీఎస్పీ లింగయ్య అరెస్టు చేసి మాగనూరు, మక్తల్ పోలీస్స్టేషన్లకు తరలించారు. జంక్‌ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని తప్పుడు ప్రచారం చేసిన కలెక్టర్‌ను సస్పెండ్ చేయాలని, సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.
రాష్ట్ర సూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి.. కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ యోగేశ్గౌతమ్తో కలిసి మాగనూర్ పాఠశాల పరిసరాలను బు ధవారం పరిశీలించారు. మ ధ్యాహ్న భోజనానికి వాడిన బియ్యాన్ని, వం ట గదిని పరిశీలించి.. నాణ్యమైన వస్తువుల ను వాడుతున్నారా..? లేదా అనే విషయంపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో మా ట్లాడారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12:30 దాటి నా విద్యార్థులకు భోజనం పెట్టలేదు. దీంతో 12:45 కు ఏడో తరగతి విద్యార్థిని అ ను ఆకలితో క్లాస్‌రూం లో అలమటిస్తుండగా డీఎంహెచ్‌వో సౌభాగ్యలక్ష్మి గుర్తించి పాఠశాల బయటకు తీసుకెళ్లారు. సదరు విద్యార్థిని ప్రజలను చూసి భ యభ్రాంతులకు గురై తిరిగి క్లాస్‌రూంకు వెళ్లి ఆకలితోనే కూర్చున్నది.చివరికి 12:57కు విద్యార్థులను భోజనానికి వదిలారు.
మా పిల్లలకు బడికి పంపేటప్పుడు డబ్బులు ఇ స్తలేం. అలాంటిది స్కూల్ వద్ద బయటి వస్తువులు ఎట్లా కొంటరు. ప్రభుత్వం తమ తప్పులు తెలియకుండా మా బిడ్డల మీద వేస్తున్నారు. నాసిరకం బి య్యం, సరిగా ఉడకని అన్నం పెట్టడంతో మధ్యాహ్నం తిండి మాని ఇంటికి వస్తున్నారు. బడిలో తాగునీళ్లు కూడా లేవు.
– కిష్టమ్మ, మాగనూరు, (అస్వస్థతకు గురైన 7వ తరగతి విద్యార్థిని స్వాతి తల్లి )
బడిలో పిల్లలకు ఉడకని వంకాయ, ఆలుగడ్డతో వండిన కర్రీ వడ్డించిండ్రు. అది తినడంతోనే మా బిడ్డ సంగీతకు వాంతులు, కడుపునొప్పి వచ్చింది. ప్రభుత్వం పిల్లలకు భోజనం పెట్టడం చేత కాకపోతే మానుకోవాలి. అంతే కాని పిల్లలకు బయట చిరుతిండ్లు తింటున్నారని వారిపై నెట్టడం భావ్యం కాదు. మా వద్ద డబ్బులు ఉంటే కదా బడికి వెళ్లే సమయంలో పిల్లలకు ఇచ్చి పంపుతాం. అధికారులు పిల్లలపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నరు.
– శంకరమ్మ, విద్యార్థిని తల్లి, మాగనూరు