గద్వాల, సెప్టెంబర్ 2 : జోగుళాంబ గద్వాల కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్‌రావు బోటెక్కి సోమవారం కృ ష్ణానది మధ్యలో ఉన్న దివి గ్రామమైన గుర్రంగడ్డకు చే రుకున్నారు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చా రు.
గ్రామాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని, త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కరెంట్ కోతలు లేకుండా సంబంధిత అధికారులతో మాట్లాడుతామని, అంగన్వాడీ టీచర్‌ను నియమిస్తామని, సబ్సెంటర్లో వైద్యులు అందుబాటులో ఉంటారని చెప్పా రు. అనంతరం తిరిగి బోటులో బీచుపల్లి వరకు వారు ప్రయాణం చేశారు. వారి వెంట తాసీల్దార్ కరుణాకర్, వైద్యాధికారి సిద్ధ్దప్ప, డాక్టర్ ఏంజెల్ ఉన్నారు.