పరేషన్!
రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు ఉచిత బియ్యం పథకం అమ లు చేస్తూ మూడు నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి సరఫరా చేస్తుంటే.. నాగర్‌కర్నూల్ జిల్లాలో మాత్రం బియ్యం లేక పథకం అమలు తీరులో సంక్షోభం ఏర్పడింది.
- నాగర్‌కర్నూల్ జిల్లాలో అందని సీఎంఆర్
- సివిల్ సప్లయి గోదాంల వద్ద డీలర్ల పడిగాపులు
- మిల్లర్ల నుంచి అందని 20,200 మెట్రిక్ టన్నులు
- మూడ్నెళ్ల కోటా ఒకేసారి ఇవ్వడంతో సమస్య జఠిలం
- షాపుల వద్ద పంపిణీ లేక లబ్ధిదారుల ఆందోళన
నాగర్‌కర్నూల్, ఆగస్టు 11 : రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు ఉచిత బియ్యం పథకం అమ లు చేస్తూ మూడు నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి సరఫరా చేస్తుంటే.. నాగర్‌కర్నూల్ జిల్లాలో మాత్రం బియ్యం లేక పథకం అమలు తీరులో సంక్షోభం ఏర్పడింది. మూడు నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి సరఫరా చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం అందుకు అవసపరమైన బి య్యం సమకూర్చడంలో విఫలమైంది. దీంతో అటు డీ లర్లు, ఇటు లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.
గోదాముల వద్ద డీలర్లు, రే షన్ దుకాణాల వ ద్ద లబ్ధిదారులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు దాపురించాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టులో మూడు నెలలకు సంబంధించిన బియ్యం సరఫరా చేసేందుకు డీలర్లు పూనుకున్నారు. అందుకు సంబంధించిన డీ డీలు చెల్లించినప్పటికీ సకాలంలో బియ్యం సరఫరా చేయడంలో సివిల్ సప్లయ్ అధికారు లు విఫలమ య్యారు.
ఒక్కో డీలర్‌కు 500 నుంచి 600 క్వింటాళ్ల బియ్యం ఇవ్వాల్సి ఉం డగా, 200 నుంచి 300 క్వింటాళ్ల వరకే ఇప్ప టి వరకు సరఫరా చేసి చేతులు దులుపుకొన్నారు. రేపు మాపు అంటూ నెలలో సగం రో జులు గడిచినా బియ్యం అందించకపోవడం తో డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు నెలల బియ్యం కోసం రేషన్ దుకాణాల ముందు బారులు తీరుతున్న లబ్ధిదారులకు సమాధానం చెప్పలేకపోతున్నారు.
మిల్లర్ల నుంచి అందని 20,200 మెట్రిక్ టన్నులు
2024-25 యాసంగి సీజన్‌కు సంబంధించి మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యం సకాలంలో అందించకపోవడం తో జిల్లా వ్యాప్తంగా రేషన్ వ్యవస్థ కుంటుపడింది. జిల్లా వ్యా ప్తంగా ఉన్న 558 రేషన్ దుకాణాల పరిధి లో 2,43,213 రేషన్ కార్డులు కలిగిన 7లక్షల 40,610మంది లబ్ధిదారులకు ప్రతి నెలా 5,110.250 మెట్రిక్ టన్నుల రేషన్ అం దించాల్సి ఉంటుంది. ఇందుకు గానూ ప్రభు త్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యా న్ని మిల్లులకు ఇస్తుంది. దానికి బదులుగా మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం రూపంలో తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు అందించాల్సి ఉంటుంది.
కానీ మిల్లర్లు ప్రభుత్వం నుంచి వడ్లు తీసుకున్నారే కానీ సకాలంలో సీఎంఆర్ బియ్యం అందించలేకపోయారు. దీంతో నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రేషన్ వ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోయింది. ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఉన్న 54 మిల్లులకు సీఎంఆర్ బియ్యం అందించేందుకు అనుమతులు ఇవ్వగా అందలో 18 మిల్లులకు చెందిన వారు 20,200 మెట్రిట్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందించకుండా తాత్సారం చేయడంతో ఈ సమస్యల జఠిలమైంది.
ఈ విషయంలో ప్రభుత్వం, సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు మిల్లర్లపై ఎలాంటి చర్య లు తీసుకోకపోవడంతోనే సివిల్ సప్లయ్ వ్యవ స్థ అంతా కుంటుపడుతుందని చర్చించుకుంటున్నారు. సకాలంలో సీఎంఆర్ బియ్యం ఇ వ్వని మిల్లులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే వారికి ఇచ్చిన గడువులోగా బియ్యం ఇవ్వలేకపోయిన మిల్లర్లకు బుధవారం కలెక్టరేట్లో మిల్లర్లతో జరిగిన సమావేశంలో ఆగస్టు నెలాఖరు వరకు మి ల్లర్లు పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ బియ్యాన్ని సరఫరా చేయాలని అవకాశం ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

