మక్తల్ టౌన్, జనవరి 20 : తెలంగాణ వైద్య సేవలు దే శానికే తలమాణికంగా మారిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో లబ్ధిదారుల కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
రాష్ట్రంలోని సర్కార్ దవాఖానలను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసి కార్పొరేట్ స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం నిరుపేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పట్టణానికి చెందిన రాజుకు రూ.16వేలు, లింగంపల్లి గ్రామానికి చెందిన బాలరాజుకు రూ.50వేలు, మాగనూర్ మండలం బైరంపల్లి గ్రామానికి చెందిన స్వాతికి రూ. 60వేలు, నర్వ మండలం పాతర్చేడ్ గ్రామానికి చెందిన కు మార్కు రూ.28వేలు, వెంకటమ్మకు రూ.42వేల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే అందించారు. కార్యక్రమంలో నా యకులు శ్రీనివాస్ గుప్తా, మహిపాల్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, ఈశ్వర్, నేతాజీ పాల్గొన్నారు.
భూమి స్వభావాన్ని బట్టి నీటిని వినియోగించాలి
నేటి వ్యవసాయ రంగంలో వరి సాగులో భూమి స్వభావాన్ని బట్టి నీ టిని వినియోగించుకున్నప్పుడే అధిక దిగుబడులతోపాటు నీటి శాతం తగ్గిస్తే వాయు కాలుష్యాన్ని తగ్గించగలుగుతామని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. సో అండ్ రీప్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ వా రి సౌజన్యంతో సుస్థిర వ్యవసాయ వి ధానాలను ప్రోత్సహించాలని మండలంలోని రుద్రసము ద్రం రైతువేదికలో శుక్రవారం రైతులకు అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన రంగం వ్యవసాయ రంగమేనని పేర్కొన్నారు. వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తూ సో అండ్ రీప్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో వివిధ పద్ధతులతో రైతులకు సుస్థిర వ్యవసాయాన్ని పరిచయం చేస్తున్నారన్నారు.
రైతులకు సహాయపడే నూత న సృజనాత్మకత మార్గాలను సో అండ్ రీప్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ వారు తీసుకురావడం ఆనందదాయకమన్నారు. భూమి స్వభావాన్ని బట్టి రైతులు నీటిని వినియోగించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యేను సో అండ్ రీప్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సూరజ్ తేజ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శాస్త్రవేత డాక్టర్ రామకృష్ణ, సౌ అండ్ రీప్ అగ్రో సంస్థ ఆర్గనైజర్ రాజేశ్వరి, ఏవో మిథున్ చక్రవర్తి, బీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఎంపీటీసీ వెం కటయ్య, సర్పంచులు లక్ష్మి, హన్మంతు, మాజీ ఎంపీటీసీ రవిశంకర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.