కొల్లాపూర్ : కొల్లాపూర్ : ఇచ్చిన హామీలను అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) నాగర్కర్నూల్ జిల్లా జటప్రోల్లో శుక్రవారం ఏం మొహం పెట్టుకోని వస్తున్నారని బీజేపీ (BJP) కొల్లాపూర్ మండల అధ్యక్షుడు కేతూరి నారాయణ ( Narayana) అన్నారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెంట్లవెల్లి సహకార సొసైటీలో ఉన్న 499 మంది రైతులకు రుణమాఫీ అయ్యేవిధంగా సభలో సీఎం రేవంత్ రెడ్డి చేత చెప్పించాలని మంత్రి జూపల్లిని డిమాండ్ చేశారు. రైతులందరికీ రుణ మాఫీ అమలు చేయకపోతే నియోజకవర్గం పర్యటనను రద్దు చేసుకోవాలని కోరారు.
ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలనే సోయి లేకుండా మంత్రి జూపల్లి ఉన్నారని ఎద్దేవా చేశారు. తక్షణమే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. రుణమాఫీ చేయకపోతే పెంట్లవెల్లి , కొల్లాపూర్ మండల రైతులతో కలిసి సీఎం సభను, మంత్రి జూపల్లిని అడ్డుకుంటామని హెచ్చరించారు.