దేవరకద్ర రూరల్ (చిన్నచింతకుంట), సెప్టెంబర్ 15 : ఈ నెల 5వ తేదీన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. ఈ క్రమంలో ఆదివారం ఎమ్మెల్యే స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో కృష్ణారెడ్డి దశదినకర్మ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై ఎమ్మెల్యే తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచందర్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, శంకర్, వాకిటిశ్రీహరి, పర్ణికారెడ్డి, రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, మేఘారెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరి త, నాయకులు భాస్కర్, హర్షవర్ధన్‌రెడ్డి, జలందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.