వెల్దండ : నాగర్ కర్నూలు జిల్లా మండలం కంటోన్ పల్లి గ్రామానికి (Cantonpalli Village ) చెందిన వెంకటయ్య, ప్రేమలత అనే లబ్ధిదారులకు గ్రామ మాజీ సర్పంచ్ పెద్ది రామకృష్ణ, మాజీ ఉపసర్పంచ్ సురేందర్ సీఎం సహాయనిధి చెక్కులను ( CM Relief Fund ) అందజేశారు.
ఆస్పత్రి ఖర్చులకోసం ఇరువురు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో కాంటోనిపల్లి గ్రామపంచాయతీ కి చెందిన వెంకటయ్య కు రూ. 21, 000 వేలు, కూన ప్రేమలత కు రూ .34,000 వేలు సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయి.
వీటికి సంబంధించిన చెక్కును బాధితులకు సోమవారం అందజేసినట్టు మాజీ సర్పంచ్ రామకృష్ణ తెలిపారు. సీఎం సహాయనిది పథకం పేదలకు వరం లాంటిదని ఆయన అన్నారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.