HomeMahabubnagarCm Kcr Wishes People Of Telangana On Secretariat Inauguration
హైదరాబాద్‌లో సచివాలయం ప్రారంభోత్సవం
హైదరాబాద్‌లో ఆదివారం సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఉమ్మడిజిల్లాలోని ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చాంబర్లలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి శాలవాలు కప్పి సన్మానించారు.
హైదరాబాద్‌లో ఆదివారం సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఉమ్మడిజిల్లాలోని ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చాంబర్లలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి శాలవాలు కప్పి సన్మానించారు. సీఎంతోపాటు మంత్రులను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అబ్రహం, జైపాల్‌యాదవ్, ఎంపీ రాములు, ఎమ్మెల్సీలు వాణీదేవి, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప తదితరులున్నారు.
– నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 30
సెక్రటేరియట్ ప్రారంభోత్సవం అనంతరం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని ఆయన చాంబర్లో ఎమ్మెల్యేలు బీరం, చిట్టెం, పట్నం, ఆలతోపాటు ఎమ్మెల్సీలు కూచకుళ్ల, కశిరెడ్డి, గోరటి వెంకన్న కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, విప్ గువ్వల బాలరాజు ఆయన చాంబర్లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.