నాగర్‌కర్నూల్, మే 12 (నమస్తే తెలంగాణ) : పల్లెల్లో క్రీడా పండుగ ప్రారంభం కానున్నది. 15వ తేదీ నుంచి సీఎం కప్-2023 పోటీలు సంబురంగా కొనసాగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవంలో భాగంగా యువజన, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సీఎం కప్ నిర్వహణపై తొలి సంతకం చేశారు. దీంతో తెలంగాణలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు 15 నుంచి 36 ఏండ్లలోపు వయోజనులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించనున్నారు. అలాగే మహిళలకు ప్రత్యేక పోటీలు జరిపించనున్నారు. మండలస్థాయికి రూ.15 వేలు, జిల్లా స్థాయికి రూ.75 వేల చొప్పున మంజూరు చేశారు. మండలస్థాయిలో ఎంపీపీ, జిల్లా స్థాయిలో కలెక్టర్లు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. ఫలితంగా గ్రామీణ క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం లభించనున్నది.
గ్రామీణ క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించాలని రా ష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాల యం ప్రారంభోత్సవంలో క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన తొలి సంతకంతో గ్రా మాల్లో క్రీడా పండుగ నెలకొన్నది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయి. 15 నుంచి 36 ఏండ్లలోపు వయస్సున్న పురుషులు, మహిళలు పోటీల్లో పాల్గొనవచ్చు. మండల, జిల్లా స్థాయిలో పోటీల నిర్వహణకు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో ఎంపీపీ, జిల్లా స్థాయిలో కలెక్టర్లు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. మం డల స్థాయిలో ఐదు రకాలు, జిల్లా స్థాయిలో 11 రకాల పోటీలు నిర్వహిచంనున్నారు. ఇందుకోసం అవసరమైన పీ ఈటీ, పీడీలను కూడా సిద్ధం చేశారు. మండల స్థాయిలో ఆయా పోటీల్లో గెలుపొందిన జట్లను జిల్లా స్థాయికి పంపిస్తారు. జిల్లా స్థాయిలోని విజేతలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. మండల స్థాయిలో గ్రామ స్థాయి నుంచి వచ్చిన జట్లు ప్రాతినిధ్యం వహిస్తాయి. మండల స్థాయిలో ఈనెల 15వ తేదీ నుంచి 17 వరకు, జిల్లా స్థాయి పోటీలు 22 నుంచి 24వ తేదీ వరకు జరుగుతాయి.
ఇలా దాదాపు పది రో జులపాటు క్రీడా పోటీలు పండుగలా జరగనున్నాయి. జిల్లా యువజన, క్రీడా శాఖ పోటీలను పర్యవేక్షిస్తూ ఏర్పాట్లను చేపట్టనున్నది. ప్రతి మండలానికి రూ.15 వేల చొప్పున, జిల్లా స్థాయి పోటీలకు రూ.75వేల చొ ప్పున ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. స్థానికంగా దాతల ద్వారా కూడా అవసరమైన ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉన్నది. ఈ నిధులతో సర్టిఫికెట్లు, ఆట సామగ్రి, ఆట స్థలం తయారు, బ్యానర్లు, ఫ్లెక్సీ ఏర్పా ట్లు, ఆటస్థలాల మార్కింగ్, మైకులు, కుర్చీలు, టేబుళ్లు, టెంటు, బహుమతులు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. మండల స్థాయిలో పోటీల నిర్వహణకు క్రీడాకారులు తమ పేర్లు నమో దు చేయించుకునేలా జిల్లా యువజన, క్రీడా శాఖ చర్యలు తీసుకుం టున్నది. పురుషులతోపాటు మహిళలకు సైతం పోటీలు నిర్వహిస్తున్నా రు. 11 రకాల పోటీలకుగానూ ఫుట్‌బాల్, బాక్సింగ్, రెజ్లింగ్ మినహాయించి మిగిలిన 8 విభాగాల్లో మహిళలు పాల్గొనవచ్చు. ఇలా యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం గమనార్హం.
మండల స్థాయిలో ఇలా..
మండల స్థాయి పోటీలు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరుగుతాయి. ఇందులో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, కబ డ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు జరుగుతాయి. మండల స్థా యిలో చైర్మన్‌గా ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీడీవో, తాసీల్దా ర్, ఎంఈవో, ఎస్సై, మున్సిపల్ కమిషనర్లు, పీడీ, పీఈటీ లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మండల స్థాయిలో పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతోపా టు జట్లను తయారు చేయడం, పీడీ, పీఈటీలను నియమించేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో నుంచి ఆ యా విభాగాల్లో జిల్లా స్థాయికిజట్లను ఎంపిక చేస్తుంది.
జిల్లా స్థాయిలో ఇలా..
జిల్లా స్థాయి పోటీలు ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు జరుగుతాయి. ఇందులో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, కబ డ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బా క్సింగ్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్, రెజ్లింగ్ వంటి 11 రకాల పోటీలు నిర్వహించాల్సి ఉంటుంది. స్థానిక పరిస్థితుల దృ ష్ట్యా ఆటల పోటీలు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో పోటీల నిర్వహణకు కలెక్టర్లు చైర్మన్లుగా, ఎస్పీలు వైస్ చైర్మన్లుగా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు కో చైర్మన్లుగా, జిల్లా యూత్, స్పోర్ట్స్ అధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇక సభ్యులుగా ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షులు, డీఈవో, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, మున్సిపల్ కమీషనర్లు ఉంటారు. ఈ కమిటీ జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేయడంతోపాటు రాష్ట్ర స్థాయికి జట్లను ఎంపిక చేస్తుంది. రాష్ట్రస్థాయి పోటీలు 28 నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతాయి. ఇందులో విజేతలకు వ్యక్తిగత విభాగంలో మొదటి బహుమతిగా రూ.20వేలు, రెండో బహుమతిగా రూ.15 వేలు, మూడో బహుమతిగా రూ.10వేలు, ఇక జట్లకు మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతిగా రూ.75వేలు, మూడో బహుమతిగా రూ.50వే లతోపాటు గోల్డ్, సిల్వర్, బ్రౌన్ పతకాలను అందజేస్తారు.
గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం..
సీఎం కప్-2023 ద్వారా 15 ఏండ్ల నుంచి 36 ఏండ్లలోపు గ్రామీణ క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆసక్తిగల క్రీడాకారులు మండల స్థాయిలోని కమిటీని సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలి. మండలస్థాయిలో విజేతలను జిల్లా స్థాయికి, ఆ తర్వాత కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయి పోటీల్లో విజేతలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను చేపడుతున్నాం. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.
– నటరాజ్, డీవైఎస్ఐ, సీఎం కప్ కన్వీనర్