మహబూబ్‌నగర్ కలెక్టరేట్, సె ప్టెంబర్ 25 : సీఎంఆర్ బియ్యం ని ర్ధేశిత గడువులోగా సేకరిస్తామని రా ష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా ఇన్చార్జి మేనేజర్ టి.విక్రమ్ తెలిపారు. ఈ నెల 24న ‘నమస్తే తెలంగాణ’ లో పాలమూరులో రూ.9కోట్ల ధా న్యం స్వాహా? 2023-24మాన్సూన్ సీజన్‌కు సంబంధించి గడువులోగా సీఎంఆర్ సేకరణ ప్రశ్నార్థకమే..? అంటూ ‘మిల్లర్ల మాయ!’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ఇన్చార్జి డీఎం స్పందించారు.
2023-24 వానకాలం సీజన్‌కు గానూ 86శాతం, యాసంగి సీజన్‌కు గానూ 50శాతం సీఎంఆర్ సేకరణ పూర్తయ్యిందన్నారు. 2023-24 వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి నిర్ధేశిత గడువు ఈ నెల 30వ తేదీలోగా మిగిలిన సీఎంఆర్ బియ్యం వేగవంతంగా సేకరణ చేపడతామని తెలిపారు. 2022-23 సీజన్‌కు సంబంధించి మహబూబ్‌నగర్ అల్లీపూర్ సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి ఇండస్ట్రీస్ రైస్ మిల్లర్ 3002.412 మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ రూ.9.44కోట్లు పక్కదారి పట్టించడంపై జూలై 12న క్రిమినల్ కేసు (ఎఫ్ఐఆర్ నం.412/2024) నమోదు చేశామని తెలిపారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా ఆర్ఆర్ యాక్ట్ అమ లు పర్చనున్నట్లు వెల్లడించారు.