అయిజ, డిసెంబర్ 23 : క్తైసవులు క్రిస్మస్ పండుగను పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. శనివారం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో క్తైస్తవులకు ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
క్రిస్మస్ పండుగ పర్వదినం ప్రాధాన్యతను గుర్తించి సర్కారు పేద కుటుంబాలకు దుస్తులను అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దేవన్న, పాస్టర్లు, క్రైస్తవులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.